Today Weather Update: ఏపీ-తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు హెచ్చరిక జారీ చేసిన వాతావరణశాఖ
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుందని.. అక్కడక్కడ పిడుగులు పడే చాన్స్ ఉందన.. కాగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.రానున్న 24 గంటల్లో తూర్పు, , ఉత్తర అండమాన్ , మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వెల్లడించింది. ఇవాళ మంచిర్యాల, ఆదిలాబాద్,, ఆసిఫాబాద్, నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్,, నిర్మల్, మేడ్చల్, వరంగల్ జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, హన్మకొండ, హైదరాబాద్ జిల్లాల్లో వానలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్, తిరుపతి కర్నూలు, శ్రీకాకులం, బాపట్ల, గుంటూరు, మన్యం, ప్రకాశం, నంద్యాల, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, గోదావరి, ఏటూరు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని.. అలాగే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.