E Commerce: రక్షాబంధన్ వేళ భారీగా దండుకున్న క్విక్ కామర్స్ సంస్థలు

రక్షాబంధన్ పర్వదినం వేళ క్విక్ కామర్స్ సంస్థలు ఆర్డర్లతో భారీగా దండుకున్నాయి.

Update: 2024-08-20 11:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రక్షాబంధన్ పర్వదినం వేళ క్విక్ కామర్స్ సంస్థలు ఆర్డర్లతో భారీగా దండుకున్నాయి.రక్షాబంధన్ పర్వదినం వేళ క్విక్ కామర్స్ సంస్థలు ఆర్డర్లతో భారీగా దండుకున్నాయి.ఈ సందర్భంగా రికార్డ్ స్థాయిలో విక్రయాలు జరిపినట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. గతంలో ఎక్కడో ఉన్న సోదరులకు రాఖీలు పంపించాలంటే తపాలా శాఖతో పాటు ఇతర కొన్ని డెలివరీ సంస్థలు మాత్రమే ఉండేవి. వాటిలో సోదరీమణులు రాఖీలు పంపినా సమయానికి చేరుతాయా లేదా అనేది కూడా సందేహంగా మిగిలేది. కానీ ఇప్పుడు క్విక్ డెలివరీ కామర్స్ సంస్థలు అందుబాటులోకి రావడంతో రాఖీలతో పాటు అవి కట్టిన సోదరీమణులకు అందించే బహుమతులు కూడా భారీగానే అమ్ముడయ్యాయి. ఈ నేపధ్యంలోనే క్విక్ కామర్స్ సంస్థలు ఆర్డర్లతో పండగ చేసుకున్నాయి. గతేడాది కంటే మెరుగైన విక్రయాలు నమోదు చేసినట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి.

రాఖీ సేల్స్ పై ప్రముఖ ఆన్‌లైన్ క్విక్ డెలివరీ ప్లాట్ ఫాం బ్లింకిట్ సీఈఓ అల్బీందర్ సింగ్ స్పందిస్తూ.. ఒక్క రోజులోనే అధిక ఆర్డర్లు నమోదు అయ్యాయని, నిమిషానికి సగటున 639 రాఖీలు విక్రయించినట్లు ప్రకటించారు. అంతేగాక చాక్లెట్ విక్రయాలు కూడా విపరీతంగా పెరిగాయని, తమ సేవలపై నమ్మకం ఉంచిన కస్టమర్లకు దన్యవాదాలు తెలిపారు. అలాగే స్విగ్గీ ఇన్‌స్టా‌మార్ట్‌లో రాఖీలతో పాటు బహుమతులు కూడా భారీగా పెరిగినట్లు ప్రకటించింది. దీనిపై స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ నిన్న ఒక్క రోజే ఫర్ఫ్యూమ్ ఆర్డర్లు ఏకంగా 646 శాతం పెరిగినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ముంబై నుంచే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని, బొమ్మలు, చాక్లెట్లతో పాటు మహిళల మేకప్ లకు సంబందించిన వస్తువులు ఎక్కువగా అమ్ముడయ్యాయని తెలిపారు.

Tags:    

Similar News