మరిన్ని నగరాలకు వ్యాపారాన్ని విస్తరించే పనిలో డన్‌జో!
రిలయన్స్ రిటైల్ మద్దతు ఉన్న నిత్యావసరాల సరఫరా సంస్థ డన్‌జో వచ్చే 12-18 నెలల్లో పది నుంచి పదిహేను నగరాలకు వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
బెంగళూరు: రిలయన్స్ రిటైల్ మద్దతు ఉన్న నిత్యావసరాల సరఫరా సంస్థ డన్‌జో వచ్చే 12-18 నెలల్లో పది నుంచి పదిహేను నగరాలకు వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తాము ప్రభుత్వ మద్దతున్న ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్‌డీసీ)తో కలిసి పనిచేస్తుందని, ఉత్పత్తులను సరైన సమయానికి డెలివరీ అందించేందుకు మరింత సామర్థ్యంతో పనిచేయనున్నట్టు డన్‌జో సహ-వ్యవస్థాపకుడు దల్‌వీర్ సూరి అన్నారు.
ప్రస్తుతం దాదాపు 10 నగరాలో వ్యాపార ఉనికిని కలిగిన తాము ఏడాది లేదా 18 నెలల్లో మరిన్ని నగరాలకు విస్తరించనున్నాం. ప్రధానంగా కిరాణా ఇంకా ఇతర సామగ్రి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని ఆయన తెలిపారు. ఓఎన్‌డీసీ ఎ్‌వర్క్ నునంచి ప్రధాంగా బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై నగరాల్లోనే ఎక్కువ ఆర్డర్లు తీసుకుంటున్నట్టు దల్‌వీర్ సూరి చెప్పారు. ఆదాయ పరంగా మెరుగ్గా ఉన్నందున విస్తరణపై దృష్టి సారించామన్నారు.