మార్చిలో 8 శాతం తగ్గిన డీమ్యాట్ ఖాతాలు!
ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 11.4 కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సోమవారం ప్రకటనలో తెలిపింది.
ముంబై: ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 11.4 కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సోమవారం ప్రకటనలో తెలిపింది. అయితే, కొత్త డీమ్యాట్ ఖాతాల పెరుగుదల నెలవారీగా 8 శాతం పడిపోయిందని మోతీలాల్ ఓస్వాల్ తన నివేదికలో వెల్లడించింది. గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగానే డీమ్యాట్ ఖాతాల సంఖ్య వృద్ధి ప్రభావితమైంది. అలాగే, సగటున రోజువారీ టర్నోవర్ 13 శాతం పెరిగి రూ. 237 లక్షల కోట్లకు చేరుకుంది.
నివేదిక డేటా ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 21 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు అందుబాటులోకి రాగా, మార్చిలో 19 లక్షల ఖాతాలు పెరిగాయి. అదే విధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటున రోజుకు 29 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు పెరిగాయని నివేదిక అభిప్రాయపడింది.
ఇక, స్టాక్ బ్రోకట్లలో జెరోధా వినియోగదారుల సంఖ్య నెలవారీగా 8 శాతం తగ్గి 64 లక్షలకు చేరుకోగా, కంపెనీ మార్కెట్ వాటా 19.6 శాతానికి చేరుకుంది. ఏంజెల్‌వన్ వినియోగదారులు 0.3 శాతం పెరిగి 43 లక్షలకు పెరిగింది. మార్కెట్ వాటా పరంగా 13.1 శాతం పెరుగుదలను సాధించింది. అప్‌స్టాక్స్ ఖాతాదారుల సంఖ్య 8 శాతం, మార్కెట్ వాటా 8.8 శాతం పెరిగిందని నివేదిక వెల్లడించింది.
Also Read..