Black Rice: నల్ల బియ్యం కిలో రూ.500.. రైతులకు లక్షల్లో ఆదాయం

కొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి. వర్షాకాలం ప్రారంభం కానుంది. దీంతో తొలకరి జల్లులు పడగానే రైతులు వరి సాగు చేయడానికి సిద్ధం అవుతారు.

Update: 2023-05-31 13:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి. వర్షాకాలం ప్రారంభం కానుంది. దీంతో తొలకరి జల్లులు పడగానే రైతులు వరి సాగు చేయడానికి సిద్ధం అవుతారు. మార్కెట్లో కొత్త కొత్త రకాల వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రైతులు ఎక్కువ పంట, ఎక్కువ ఆదాయం ఇచ్చే వరి వంగడాన్ని ఎంచుకుంటారు. ఇటీవల కాలంలో కొత్త కొత్త సాగు పద్ధతులు వస్తుండటంతో శాస్త్రవేత్తలు కొత్త వరి వంగడాలను తయారు చేస్తున్నారు. ఇవి అధిక వర్షాలు, కరవును సైతం తట్టుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని అందిస్తాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ‘Black Rice(నల్ల బియ్యం)’ కూడా అదే వర్గానికి చెందింది. ఈ పంట వేయడం ద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చు.

Also Read:  కీలక మైలురాయిని దాటిన రెనాల్ట్ ఇండియా! 


నల్ల బియ్యం సాగు మొదటగా చైనాలో ప్రారంభమైంది. ఆ తరువాత భారత్‌లో మణిపూర్, అస్సాంలో అడుగుపెట్టింది. మొదట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేసిన ఈ పంట, ఇటీవల కాలంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పంట పట్ల రైతన్నలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా నల్ల బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో దీనిని తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ కారణంగా నల్ల బియ్యంకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది.



సాధారణ బియ్యం ధర మార్కెట్లో కిలో రూ.40 నుంచి ఉంటుంది. ఇంకా బియ్యం రకాన్ని బట్టి కిలో రూ. 160 వరకు ఉంది. కానీ ‘నల్లబియ్యం(Black Rice)’ ధర కిలో రూ. 250 నుంచి ప్రారంభమై కిలోకు రూ. 500 వరకు ఉంటుంది. బాస్మతి బియ్యంతో పోల్చుకుంటే నల్లబియ్యం ధరే ఎక్కువగా ఉండటం విశేషం. బ్లాక్ రైస్‌లో ఉన్న ఆరోగ్యకర ప్రొటీన్ల వలన ప్రజలు వీటి కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ బియ్యం ప్రధానంగా నల్లగా ఉన్నప్పటికి ఉడికిన తర్వాత దాని రంగు కొంచెం మారుతుంది. అందుకే దీనిని బ్లూ రైస్ అని కూడా అంటారు.



ఈ వరి సాగు విధానం సాధారణ వరి సాగు లాగే ఉంటుంది. ఇది పంట వేసిన 100 నుండి 110 రోజుల్లో చేతికి వస్తుంది. దీని పొడవు సాధారణ వరి వలే ఉన్నప్పటి దీని గింజల పొడవు మాత్రం ఎక్కువగా ఉంటుంది. రెండు ఎకరాల్లో నల్ల వరి సాగు చేసినట్లయితే లక్షల రూపాయల ఆదాయం సంపాదించవచ్చు. రెగ్యులర్ వరి పంటలతో పోల్చుకుంటే నల్ల బియ్యం సాగు తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ లాభం మాత్రం భారీగా పొందవచ్చు. ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని సాగుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.

Tags:    

Similar News