Blue Aadhaar అంటే ఏమిటి? దానికి ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు మీకోసం
ఇండియాలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డులలో మొదటి స్థానంలో ఉండేది ఆధార్ కార్డు..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డులలో మొదటి స్థానంలో ఉండేది ఆధార్ కార్డు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రయోజనాలు పొందాలన్నా ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ప్రజలందరికి ఆధార్ ఉండాల్సిన అవసరం ఉంది. పెద్దలకు ఉన్నట్టుగానే పిల్లలకు కూడా ఆధార్ అవసరం. కానీ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్‌కు సంంధించిన బయోమెట్రిక్ వివరాలు సరిగ్గా రావు. 2 సంవత్సరాల లోపు శిశువుల విషయంలో ఆధార్ బయోమెట్రిక్ వివరాలు సేకరించడం చాలా కష్టంగా ఉంటుంది.
అందుకే ఈ ఇబ్బందులను గమనించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం బ్లూ ఆధార్ (Blue Aadhaar) ఆధార్‌ను తీసుకొచ్చింది. దీనినే బాల్ (Baal) ఆధార్ అని కూడా అంటారు.
ప్రభుత్వం 2018 లో బ్లూ ఆధార్ కార్డును ప్రారంభించింది. పిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన బ్లూ ఆధార్ సాధారణ కార్డు లాగే బ్లూ కలర్‌తో 12 అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది. ఈ కార్డుకు పిల్లల బయోమెట్రిక్ వివరాలు అవసరం లేదు. దీని కోసం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
బ్లూ ఆధార్‌కు సంబంధించిన ముఖ్య వివరాలు
* మొదటగా ఆధార్ సెంటర్‌కు వెళ్ళాలి.
* బ్లూ ఆధార్ కోసం తల్లిదండ్రులు తమ బిడ్డ పేరుతో ఆధార్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నింపాలి.
* ఆసుపత్రి నుంచి బర్త్ సర్టిఫికెట్ లేదా డిశ్చార్జ్ స్లిప్, ఫొటో వంటి ఐడెంటిటీ డాక్యుమెంట్స్ సమర్పించాలి.
* పిల్లల స్కూల్ ఐడీ ని ఉపయోగించి కూడా బ్లూ ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు.
* ఐదు సంవత్సరాలు దాటాక పిల్లల ఫొటో, పది వేళ్ల బయోమెట్రిక్‌లు, ఐరిస్/కంటిపాప వంటి బయోమెట్రిక్ వివరాలు అప్‌లోడ్ చేయాలి.
* లేదంటే ఐదు ఏళ్లు నిండిన తర్వాత పిల్లలకు బాల్ ఆధార్ చెల్లదు.
* 15 ఏళ్ల వయస్సులో మరోసారి వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ సమాచారం అందించాలి. ఇది కూడా పూర్తిగా ఉచితం.
* పిల్లల ఆధార్ కార్డ్‌తో తల్లిదండ్రుల ఆధార్ లింక్ చేస్తారు. కాబట్టి అప్లికేషన్ టైం లో తల్లిదండ్రుల ఆధార్ వివరాలు సమర్పించాలి.
* డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత మెసేజ్ వస్తుంది.
* వెరిఫికేషన్ పూర్తయిన 60 రోజుల లోపు పిల్లల పేరు మీద బ్లూ ఆధార్ లేదా బాల్ ఆధార్ కార్డు జారీ అవుతుంది.
ఇవి కూడా చదవండి : ఓటర్ ఐడీకి ఆధార్ లింక్