రిలయన్స్-డిస్నీ విలీన ఒప్పందం సక్సెస్! నివేదిక

గత కొంత కాలంగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ మధ్య విలీన చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-02-25 12:26 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంత కాలంగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ మధ్య విలీన చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇది ముందడుగు పడిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఈ రెండు కంపెనీలు బైండింగ్ విలీన ఒప్పందంపై సంతకం చేశాయని నివేదిక ఆదివారం తెలిపింది. విలీన సంస్థలో దాదాపు 61 శాతం వాటాను రిలయన్స్‌కు చెందిన మీడియా యూనిట్, దాని అనుబంధ సంస్థలు కలిగి ఉంటాయని, మిగిలిన వాటాను వాల్ట్ డిస్నీ కలిగి ఉంటుందని సమాచారం.

ఈ ఒప్పందంలో భాగంగా డిస్నీకి చెందిన ఇతర ఆస్తులను కూడా కొనుగోలు చేయడానికి రిలయన్స్ ఆసక్తిని కనబరిచినట్లు తెలుస్తుంది. డిస్నీ మైనారిటీ వాటాను కలిగిన టాటా ప్లే లిమిటెడ్‌ను కూడా కొనుగోలు చేయడంపై రిలయన్స్ ఆలోచిస్తోంది. రిలయన్స్-డిస్నీ విలీనం పూర్తయిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్లో ఇవి ప్రధాన మీడియాగా మారుతాయని నివేదిక హైలెట్ చేసింది.

నివేదికల ప్రకారం, రిలయన్స్ తన 61 శాతం వాటా కోసం $1.5 బిలియన్లను పెట్టుబడి పెడుతోంది. కొద్ది కాలం క్రితం OTT విభాగంలో రిలయన్స్‌కు డిస్నీ మధ్య ప్రత్యక్ష పోటీ నడిచింది. క్రీడా హక్కుల కోసం తీవ్రంగా పోరాడాయి. కానీ 2022లో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ టోర్నమెంట్ స్ట్రీమింగ్ హక్కులను రిలయన్స్ దక్కించుకోవడంతో డిస్నీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత ఈ విలీనం గురించిన ప్రతిపాదనలు వచ్చాయి.


Similar News