బిగ్ అలర్ట్: ఆ బ్యాంకులో లోన్లు తీసుకుంటున్నారా?
లోన్లు తీసుకోవడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయింది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం కారణంగా అందరి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది.
దిశ, వెబ్డెస్క్: లోన్లు తీసుకోవడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయింది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం కారణంగా అందరి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో వస్తున్న వేతనం సరిపోక అందరూ లోన్లు తీసుకోవడం కామన్ అయిపోయింది. అయితే, లోన్లు తీసుకునే కస్టమర్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక సూచనలు చేసింది. బ్యాంక్ బరోడా లోన్లపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 8.05 శాతం నుంచి 8.10 శాతానికి పెరిగింది. మూడు నెలల లోన్లపై 8.45 శాతానికి చేరుకోగా, 6 నెలల రుణాలపై 8.65%, ఏడాది రుణాలపై 8.85 శాతానికి పెరిగింది. ఇవి నేటి నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధి పేర్కొన్నారు. అంతేకాదు.. అటు హెచ్డీఎఫ్సీ కూడా వడ్డీ రేటు పెంచింది. గృహ రుణాలపై వడ్డీరేటు 9.05% మధ్య ఉంది.