BIG Alert: పాన్‌కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆధార్ లింక్ చేసుకోవడానికి చివరి తేదిదే..!
పాన్‌కార్డు(Pancard) ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం(Central Govt) బిగ్ అలర్ట్ జారీ చేసింది.
దిశ,వెబ్‌డెస్క్: పాన్‌కార్డు(Pancard) ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం(Central Govt) బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు పాన్‌కార్డును ఆధార్ కార్డు(Aadhaar card)తో లింక్ చేసుకోవాలని సూచించింది. లింక్ చేయకుంటే డిసెంబర్ 31 తర్వాత పాన్‌కార్డులు డీయాక్టివేట్(Deactivate) అవుతాయని తెలిపింది. ఆ తర్వాత తదుపరి లావాదేవీల్లో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అయితే కొన్ని ఫిన్ టెక్ కంపెనీలు(Fintech Companies) కస్టమర్ల పర్మిషన్ తీసుకోకుండా వారి ప్రొఫైల్‌లను క్రియేట్ చేయడానికి పాన్‌కార్డులో ఉన్న డేటాను యూజ్ చేసుకుంటున్నాయి. ఇవి ఆర్థిక మోసాలకు దారి తీస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల పర్సనల్ ప్రైవసీని మిస్ యూజ్ చేయకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ రూల్ తీసుకొచ్చింది. కాగా పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు హెచ్చరించింది. అయినా కూడా కొంత మంది ఇంకా లింక్ చేసుకోలేదు. అటువంటి వారికోసం ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) మరో అవకాశం కల్పించింది.