Bandhan Bank: బంధన్ బ్యాంక్ కొత్త ఎండీ, సీఈఓగా ప్రతీమ్ సేన్‌గుప్తా నియామకం

దేశీయ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఒకటైన బంధన్ బ్యాంక్(Bandhan Bank) తమ కొత్త మేనేజింగ్ డైరెక్టర్(MD), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)గా పార్థ ప్రతీమ్ సేన్‌గుప్తా(Partha Pratim Sengupta)ను నియమించింది.

Update: 2024-10-25 13:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఒకటైన బంధన్ బ్యాంక్(Bandhan Bank) తమ కొత్త మేనేజింగ్ డైరెక్టర్(MD), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)గా పార్థ ప్రతీమ్ సేన్‌గుప్తా(Partha Pratim Sengupta)ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్(Bank Board of Directors) మీటింగ్ లో సంస్థ అధికారంగా ప్రకటించింది. ఆయన నవంబర్ 1 నుంచి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. కాగా సేన్‌గుప్తాకు బ్యాంకింగ్ సెక్టార్(Banking sector)లో 40 ఏళ్ల అనుభవం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. అక్కడ వివిధ హోదాల్లో వర్క్ చేసి మంచి గుర్తింపు పొందారు. ఎస్బీఐకు చేసిన సేవలకు గాను సంస్థ అతన్ని మేనేజింగ్ డైరెక్టర్(MD), చీఫ్ క్రెడిట్ ఆఫీసర్(CCO)గా నియమించింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ఎండీ, సీఈఓగా కూడా బాధ్యతలు చేపట్టారు.

Tags:    

Similar News