Today Gold Price: ఆగస్టు 08: మూడో రోజు కూడా భారీగా తగ్గిన గోల్డ్ ధరలు.. తులం ఎంత ఉందంటే?

మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు.

Update: 2024-08-08 05:26 GMT

దిశ, ఫీచర్స్: మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా అన్నింటిలో ఎక్కువగా వారికి పసిడిపై మక్కువ ఎక్కువగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో కొనుగోలు దారులు ఎప్పుడు తగ్గితే అప్పుడే కొనుగోలు చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో.. నిన్నటి రేట్లతో పోల్చుకుంటే బంగారం ధరలు నేడు భారీగా తగ్గి పసిడి ప్రియులకు శుభవార్త అందించాయి. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో బంగారం రేట్లు దిగొస్తున్నాయి. అయితే 22 క్యారెట్ల బంగారం రూ. 410 తగ్గగా రూ. 63, 490గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 450 తగ్గగా రూ. 69, 260కి విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండిపై రూ. 100 తగ్గడంతో రూ. 86,900గా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ.63, 490

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 69, 260

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ.63, 490

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 69, 260

Tags:    

Similar News