ఏప్రిల్-8: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
ఇటీవల బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి.
దిశ, ఫీచర్స్: ఇటీవల బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. దీంతో బంగారం అనే పదం చెప్పినా జనాల్లో వణుకుపుడుతుంది. గత నెలలో రూ.60 వేల మీదున్న ధరలు.. ఏప్రిల్ మొదటి వారంలో ఏకంగా రూ. 71, 000 చేరుకున్నాయి. ఈ విషయం తెలిసిన కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా, నేడు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. నిన్నటి రేట్లతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300 పెరగ్గా.. రూ. 65, 650గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 330 పెరగడంతో రూ. 71, 620కి చేరుకుంది. అలాగే కిలో వెండిపై రూ. 1000 పెరగడంతో రూ. 88, 000గా ఉంది. అయితే ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 65, 650
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 71, 620
విజయవాడలో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 65, 650
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 71, 620