ఏప్రిల్-11: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే మహిళలు బంగారం కొనకుండా ఉండలేరు.
దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే మహిళలు బంగారం కొనకుండా ఉండలేరు. అయితే ఇటీవల పెళ్లిళ్లు ఉండటంతో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పసిడి కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏప్రిల్ నెలలోనే అమాంతం 70 వేల పైనే పెరగడంతో బంగారం కొనడానికి జనాలు భయపడిపోతున్నారు.
అయితే నిన్నటి ధరలతో పోల్చుకుంటే.. నేడు బంగారం, వెండి రేట్లు స్వల్పంగా పెరిగి కాస్త ఉపశమనాన్ని కలిగించాయి. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరగ్గా.. రూ. 66,110గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 10 పెరగడంతో రూ. 72,120కి చేరుకుంది. అలాగే కిలో వెండి 100 పెరగ్గా 89, 100గా విక్రయిస్తున్నారు. నేడు హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,110
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,120
విజయవాడలో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,110
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,120