Apple iOS, 18.2 : సంచలనాలతో అపిల్ సరికొత్త సాఫ్ట్ వేర్
దిగ్గజ అపిల్(Apple) సంస్థ తన ఐ ఫోన్, ప్యాడ్ లకు సంబంధించి సరికొత్త స్టన్నింగ్ ఫీచర్లతో సాఫ్ట్ వేర్ అప్డేట్ (Software Update)ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
దిశ, వెబ్ డెస్క్ : దిగ్గజ అపిల్(Apple) సంస్థ తన ఐ ఫోన్, ప్యాడ్ లకు సంబంధించి సరికొత్త స్టన్నింగ్ ఫీచర్లతో సాఫ్ట్ వేర్ అప్డేట్ (Software Update)ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. సరికొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో కూడిన అప్డేట్ సాఫ్ట్ వేర్ ఇప్పుడు పబ్లిక్ బీటాలో యాపిల్ సంస్థ విడుదల చేసింది. అపిల్ చరిత్రలోనే ఇది అతి పెద్ద ఆధునీకరణగా చెబుతున్నారు. Apple iOS 18.2, iPadOS 18.2 సాఫ్ట్ వేర్ ను 15 ఆకట్టుకునే ఫీచర్లతో ఆధునీకరించి వినియోగదారులకు అందిస్తుంది.
ఇందులో AI ఎమోజి జనరేటర్ యాప్, సిరితో చాట్ జిపిటి ఇంటిగ్రేషన్, ఐఫోన్ 16 కెమెరాలను ఉపయోగించి ఇమేజ్ సెర్చ్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. గతంలో అందుబాటులో ఉన్న కొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇప్పుడు పబ్లిక్ బీటాలో ఉన్నాయి. అంటే Genmoji, ఇమేజ్ లను రూపొందించే ఇమేజ్ ప్లేగ్రౌండ్ ఫీచర్ వంటివి ఇందులో ఉన్నాయి. చాట్ జిపిటి యాక్సెస్ ఉచితం. దీన్ని ఉపయోగించడానికి ఖాతా అవసరం లేదు. ఇప్పుడు, పబ్లిక్ బీటా వినియోగదారులు తమ యాప్ ల లోపల నుండి సమాచారాన్ని చూపించమని లేదా వారి స్క్రీన్ పై కనిపించే వాటిపై చర్య తీసుకోమని సిరిని అడగవచ్చు.
అలాగే టెక్స్ట్ వ్రాయడానికి, ప్రశ్నలకు సమాధానమివ్వడానికి, చిత్రాలను సృష్టించడానికి ఇంకా మరిన్నింటికి సహాయం చేయడానికి మీరు చాట్ జిపిటిని అడగవచ్చు. ఇమేజ్ ప్లేగ్రౌండ్ సాధనం ప్రాంప్ట్ ను ఉపయోగించి కొత్త చిత్రాన్ని రూపొందించడానికి వినియోగదారులకు ఉపయోగపడుతోంది. కస్టమ్ ఎమోజీని సృష్టించడానికి Genmoji ఇదే విధమైన సిస్టమ్ ను అందిస్తుంది. కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్ లో , ఐఫోన్ 16 వినియోగదారులు కెమెరా లెన్స్ ద్వారా వాస్తవ వస్తువులు, స్థలాలను కనుగొని గుర్తించడానికి విజువల్ ఇంటెలిజెన్స్ ను ప్రారంభించేందుకు కొత్త కెమెరా కంట్రోల్ బటన్ నొక్కవచ్చు. ఆపిల్ iPadOS 18.2, mac OS Sequoia 15.2, tvOS 18.2 మొదటి పబ్లిక్ బీటాలను కూడా విడుదల చేసింది.