జనరేటివ్ ఏఐపై పెట్టుబడులకు కంపెనీల ఆసక్తి

భారత్‌తో పాటు చైనా, జపాన్, సింగపూర్ దేశాలకు చెందిన కంపెనీలు ఈ ఏడాది జనరేటివ్ ఏఐ కోసం పెట్టుబడులను మూడు రెట్లు పెంచుతాయని

Update: 2024-01-28 15:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)కి భారీగా డిమాండ్ పెరిగింది. చాలా రంగాలు ఏఐని అడాప్ట్ చేసుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. మరికొన్ని ఇప్పటికే ఏఐ వినియోగాన్ని పెంచాయి. ముఖ్యంగా కంపెనీలు జనరేటివ్ ఏఐకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఆసియా-పసిఫిక్‌లో ఉన్న కంపెనీలు ఉత్పాదక ఏఐలో భారీగా పెట్టుబడులను పెడుతున్నాయి. భారత్‌తో పాటు చైనా, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాంటి దేశాలకు చెందిన కంపెనీలు ఈ ఏడాది జనరేటివ్ ఏఐ కోసం పెట్టుబడులను మూడు రెట్లు పెంచుతాయని ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ అభిప్రాయపడింది. ఈ ఏడాదిలో సదరు కంపెనీలు సుమారు రూ. 28 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తాయని పేర్కొంది. ప్రస్తుతానికి జనరేటివ్ ఏఐ వ్యయంలో ఉత్తర అమెరికా దేశాల కంటే ఆసియా-పసిఫిక్ దేశాలు వెనుకబడినప్పటికీ, భవిష్యత్తులో అత్యంత వేగంగా ఎక్కువ ఖర్చు చేయనున్నాయని ఇన్ఫోసిస్ తెలిపింది. పలు అంచనాల ప్రకారం, ఆసియా-పసిఫిక్ దేశాల కంపెనీలు జనరేటివ్ ఏఐపై ఖర్చులు 140 శాతం పెరగనున్నాయి. 

Tags:    

Similar News