పాల ధరలను పెంచే ఆలోచన లేదన్న అమూల్!

అమూల్‌ బ్రాండ్‌ పేరిట మార్కెటింగ్‌ చేసే ‘గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ '(జీసీఎంఎంఎఫ్) ప్రస్తుతానికి పాల ధరలను పెంచే ఆలోచన లేదని ఓ ప్రకటనలో తెలిపింది.

Update: 2023-04-09 13:01 GMT

న్యూఢిల్లీ: అమూల్‌ బ్రాండ్‌ పేరిట మార్కెటింగ్‌ చేసే ‘గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ '(జీసీఎంఎంఎఫ్) ప్రస్తుతానికి పాల ధరలను పెంచే ఆలోచన లేదని ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది కాలంలో ఇన్‌పుట్ ఖర్చులు 15 శాతం పెరిగాయని, అందుకే గతేడాది కొంతవరకు రిటైల్ ధరలు పెంచినట్టు కంపెనీ ఎండీ జయేన్ మెహతా చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లలో అమూల్ బ్రాండ్ కంపెనీ గతేడాదిలో పలుమార్లు ధరలను పెంచింది. రిటైల్ ధరలలో దాదాపు 80 శాతం వరకు పాడి రైతులకు ఇస్తున్న కంపెనీ ఈ ఏడాది మార్చిలో పాల సేకరణ పెరిగిందని, ప్రస్తుత నెలలో మరింత సేకరిస్తామని మెహతా తెలిపారు.

రైతులకు మంచి ధరలను అందిస్తున్నామని, ఆ కారణంగానే పాల సేకరణ మెరుగుపడుతోందని ఆయన చెప్పారు. రానున్న నెలల్లో దక్షిణాదిన పాల సేకరణ ఇంకా పెరుగుతుంది. ఇక, కంపెనీ ఉత్పత్తులో ఐస్‌క్రీమ్ విభాగంలో అమ్మకాలు అత్యధికంగా 41 శాతం పెరిగిందని మెహతా తెలిపారు. మిగిలిన విభాగాల్లో కూడా అమ్మకాలు గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వెన్న, నెయ్యి, ఐస్‌క్రీమ్, ఫ్లేవర్డ్ పాలు, పనీర్, ఫ్రెష్ క్రీమ్ విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని జయేన్ మెహతా వెల్లడించారు. ఈ తరుణంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమూల్ ఆదాయం 20 శాతం పెరిగి రూ. 66 వేల కోట్లకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

Also Read..

30 శాతం తగ్గిన బంగారం దిగుమతులు! 

Tags:    

Similar News