అంబాసిడర్ 2.0 మార్కెట్‌లోకి న్యూ వర్షన్ రాబోతోంది!
రాజకీయ నాయకుల ఐకానిక్ కారు, భారత కార్లలో రారాజుగా వెలుగొందిన అంబాసిడర్ కార్లు తిరిగి భారత్ మార్కెట్‌లోకి రానున్నట్లు తెలిసింది.
దిశ; డైనమిక్ బ్యూరో: రాజకీయ నాయకుల ఐకానిక్, భారత కార్లలో రారాజుగా వెలుగొందిన అంబాసిడర్ కార్లు తిరిగి భారత్ మార్కెట్‌లోకి రానున్నట్లు తెలిసింది. ఈ సారి న్యూ వర్షన్, నయా లుక్‌తో రోడ్లపై చకర్లు కొట్టనుంది. భారత్‌లో అంబాసిడర్ కార్లను తయారు చేసిన హిందుస్థాన్ మోటర్ సంస్థ ఈ నయా అంబాసిడర్ కారుకు మర్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మాడల్‌ను దశాబ్దాల క్రితం సంస్థ నిలిపివేసింది. ఆటోమొబైల్ రంగంలోకి ఎన్నో కంపెనీలు ప్రవేశించడం వల్ల, ఈ పాత మాడల్‌కు ఆదరణ తగ్గిపోవడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది.
దాదాపు 65 ఏళ్ల పాటు భారత్ లో అంబాసిడర్ కారుకు 1970-80ల్లో 70 శాతం మార్కెట్ వాటా ఉండేది. ఈ క్రమంలో 80వ దశకంలో వచ్చిన మారుతి కార్లు వినియోగదారులను అక్కటుకోవడంతో అంబాసిడర్ మార్కెట్ వాటా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ నయా మాడల్‌ను తిరిగి విడుదల చేయడానికి స్థంస్థ ప్రయత్నాలను వేగవంతం చేసింది. దీంతోపాటు అంబాసిడర్‌లోనే ఎలక్టిక్ ప్రవేశపెట్టే ఉద్దేశంలో సంస్థ ఉంది. ఈ క్రమంలోనే సంస్థ యూరోపియన్‌కు చెందిన కంపెనీతో కలిసి పనిచేస్తోంది. తొలి దశలో ద్విచక్ర వాహనాన్ని, ఆ తర్వాత క్రమంలో నాలుగు చక్రాల వాహనాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.