దేశంలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు ప్రకటించిన ఏడబ్ల్యూఎస్!

గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అమెజాన్ వెబ్ సర్విసెస్(ఏడబ్ల్యూఎస్) భారత్‌తో తన పెట్టుబడులను రెట్టింపు చేయాలని భావిస్తోంది.

Update: 2023-05-18 09:24 GMT

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అమెజాన్ వెబ్ సర్విసెస్(ఏడబ్ల్యూఎస్) భారత్‌తో తన పెట్టుబడులను రెట్టింపు చేయాలని భావిస్తోంది. వేగంగా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు 2030 నాటికి క్లౌడ్ మౌలిక సదుపాయాల కోసం రూ. 1.06 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికను గురువారం ఏడబ్ల్యూఎస్ ప్రకటించింది. ఈ పెట్టుబడి దేశంలో క్లౌడ్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, ఏటా 1,00,000 శాశ్వత ఉద్యోగాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడుతుందని ఏడబ్ల్యూఎస్ తెలిపింది.

ముఖ్యంగా డేటా సెంటర్ల నిర్మాణం, నిర్వహణ, టెలీకమ్యూనికేషన్‌తో పాటు వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ప్రస్తుతం, కంపెనీ దేశీయంగా రెండు డేటా సెంటర్‌లను నిర్వహిస్తోంది. అందులో ఒకటి 2016లో ముంబైలో ప్రారంభించగా, మరొకటి హైదరాబాద్‌లో గతేడాది మొదలైంది. 2016 నుంచి ఇప్పటివరకు కంపెనీ మొత్తం రూ. 30,900 కోట్ల పెట్టుబడులు పెట్టింది. గురువారం ప్రకటనతో మొత్తం పెట్టుబడుల విలువ రూ. 1.36 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ స్టోరేజ్ నుంచి రోబోటిక్స్, ఏఐ వరకు 200 కంటే ఎక్కువ సేవలను అందిస్తోంది.

Also Read..

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసా?  

Tags:    

Similar News