Amazon: డెలివరీ ఏజెంట్ల కోసం స్మార్ట్ ఐగ్లాసెస్ తెచ్చే యోచనలో అమెజాన్
ఆర్డర్ అందించే ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈ స్మార్ట్ ఐగ్లాసెస్ ఉపయోగపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన డెలివరీ ఏజెంట్ల కోసం సరికొత్త స్మార్ట్ ఐగ్లాసెస్‌లను అభివృద్ధి చేయనున్నట్టు తెలుస్తోంది. డెలివరీ అందించాల్సిన అడ్రస్‌కు సంబంధించి చుట్టుపక్కల ప్రదేశాలు, భవనాల గురించి తెలుసుకునేందుకు, ఆర్డర్ అందించే ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈ స్మార్ట్ ఐగ్లాసెస్ ఉపయోగపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ టెక్నాలజీ విజయవంతమైతే గ్లాసెస్‌కు చిన్న ఎంబెడెడ్ స్క్రీన్‌పై డెలివరీ ఏజెంట్లకు ప్రతి రూట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ చూపిస్తుంది. రోడ్డు మార్గాలు మాత్రమే కాకుండా అపార్ట్‌మెంట్‌లలో ఎటువైపు వెళ్లాలి, గేటు సహా అన్ని రకాలుగా ఆర్డర్ అందించేందుకు సులభతరంగా పనిచేయనున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ కానందున ఇతర వివరాల గురించి స్పష్టత లేదని రాయిటర్స్ కథనం పేర్కొంది. ప్రతిరోజూ లక్షల్లో ప్యాకేజీలను అందించే అమెజాన్‌కు ఈ ఐగ్లాసెస్ చాలా సమయాన్ని ఆదా చేస్తుందని భావిస్తోంది. ఏజెంట్లు నావిగేషన్ కోసం విడిగా పరికరాలను వినియోగించకుండా స్మార్ట్ ఐగ్లాసెస్ పనిచేస్తాయి.