Bank Holidays: అలెర్ట్.. ఈ నెలలో బ్యాంక్‌లకు 14 రోజులు సెలవులు
14 రోజుల పాటు అక్టోబర్ లో బ్యాంకులు మూతపడనున్నాయి
దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనం నిత్యం డబ్బును ఉపయోగిస్తూనే ఉంటాము. పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకు ఇలా మనం వాడే ఇంటి సరుకులకు డబ్బు కావాలి. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. కానీ, ఇది అన్ని చోట్లా పని చేయదు. ఒక్కోసారి క్యాష్ ను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. డబ్బులు తీయాలంటే బ్యాంక్ లకు వెళ్ళాలి. అలాంటి వారికి అలెర్ట్ .. ఈ నెలలో ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దసారా, దీపావళి రావడంతో బ్యాంకులకు హాలిడేస్ ఉన్నాయి. అయితే, 14 రోజుల పాటు అక్టోబర్ లో బ్యాంకులు మూతపడనున్నాయి.
అక్టోబర్ 1వ తేదీ జమ్మూలో ఎన్నికల కారణంగా బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి
అక్టోబర్ 3వ తేదీ నవరాత్రులు ప్రారంభం
అక్టోబర్ 6వ తేదీ ఆదివారం
అక్టోబర్ 10వ తేదీ దుర్గాపూజ,
అక్టోబర్ 12వ తేదీ రెండో శనివారం
అక్టోబర్ 13వ తేదీ ఆదివారం
అక్టోబర్ 14వ తేదీ దాసేన్ పండుగ
అక్టోబర్ 16వ తేదీ లక్ష్మీ పూజ
అక్టోబర్ 17వ తేదీ వాల్మీకి మహర్షి జయంతి
అక్టోబర్ 20వ తేదీ ఆదివారం
అక్టోబర్ 26వ తేదీ నాలుగో శనివారం
అక్టోబర్ 27వ తేదీ ఆదివారం
అక్టోబర్ 31వ తేదీ దీపావళి పండగ