Zomato: జొమాటో నుంచి బయటకు వచ్చిన కో-ఫౌండర్ ఆకృతి చోప్రా

వ్యక్తిగత కారణాలతో సంస్థను వీడాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.

Update: 2024-09-27 16:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో కో-ఫౌండర్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ అకృతి చోప్రా సంస్థను వీడారు. 13 సంవత్సరాల నుంచి బాధ్యతలను నిర్వహిస్తున్న ఆమె తన పదవికి రాజీనామా చేసినట్టు శుక్రవారం కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. దీనికి సంబంధించి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌కు పంపిన రాజీనామా మెయిల్‌లో.. వ్యక్తిగత కారణాలతో సంస్థను వీడాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. ఆమె రాజీనామా తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2011 నుంచి జొమాటాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆకృతి చోప్రా.. ఆర్థిక, నిర్వహణ విభాగాల్లో మేనేజర్‌గా మొదట్లో కెరీర్‌ను ప్రారంభించారు. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గానే కాకుండా వైస్-ప్రెసిడెంట్‌గా, ఆ తర్వాతి కాలంలో చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జొమాటోలో చేరడానికి ముందు, ఆమె పీడబ్ల్యూసీలో మూడేళ్లు పన్ను, నియంత్రణ విభాగంలో పని చేశారు.  

Tags:    

Similar News