దిశ, వెబ్‌డెస్క్: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కొత్త వీడియో స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించింది. వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంను ప్రారంభించినట్లు ప్రకటించింది. 15 OTT కంటెంట్‌లను ఒకే యాప్‌లో అందించనుంది. ఈ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్, ప్రారంభ ధర నెలకు రూ. 149. అదే సంవత్సరానికి రూ. 1,499 అవుతుంది. Airtel Xstream Premiumలో SonyLIV, ErosNow, Lionsgate Play, Hoichoi, ManoramaMax, Shemaroo, Ultra, HungamaPlay, EPICon, Docubay, DivoTV, Klikk, Nammaflix, Dollywood, Shorts TV వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లకు కస్టమర్‌లు యాక్సెస్ పొందుతారు. కస్టమర్‌లు 10,500 కంటే ఎక్కువ సినిమాలు, షోలతో పాటు లైవ్ ఛానెల్‌లను ఒకే ప్లాట్‌ఫాంలో యాక్సెస్ చేయగలరు.
ప్రస్తుత కాలంలో OTT ప్లాట్‌ఫాంకు ఆదరణ పెరుగుతున్న కారణంగా వినియోగదారులను ఆకట్టుకొడానికి ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ను ప్రారంభించింది. కంపెనీ 20 మిలియన్ సబ్‌స్క్రిప్షన్‌లను లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియంను గో-టు డెస్టినేషన్‌గా మార్చడానికి అనేక ఇతర OTT ప్లేయర్‌లతో సహకరిస్తోందని ఎయిర్‌టెల్ సీఈఓ ఆదర్శ్ నాయర్ అన్నారు. మొబైల్, టాబ్లెట్. ల్యాప్‌టాప్‌లను ఉపయోగించి యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలు పొందవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సెటప్ బాక్స్ ద్వారా కూడా వీక్షించచ్చు. ప్రస్తుతానికి ఈ ఆఫర్ ఎయిర్ టెల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.