Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. న్యూఢిల్లీ టూ న్యూయార్క్ మధ్య కొత్త ఎయిర్‌బస్ విమానం ప్రారంభం..!
అమెరికా(USA)కు రెగ్యులర్(Regular) గా ట్రావెల్ చేసే ప్రయాణికులకు టాటా గ్రూప్(TATA Group)కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(Air India) గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్ డెస్క్: అమెరికా(USA)కు రెగ్యులర్(Regular)గా ట్రావెల్ చేసే ప్రయాణికులకు టాటా గ్రూప్(TATA Group)కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(Air India) గుడ్ న్యూస్ చెప్పింది. న్యూఢిల్లీ టూ న్యూయార్క్(New Delhi to New York) మధ్య కొత్తగా మరో ఎయిర్ బస్ ఏ350-900(Airbus A350-900) విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు శుక్రవారం తెలిపింది. ఈ విమానాన్ని డిసెంబర్ రెండో తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ ఫ్లైట్ న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Indira Gandhi International Airport) నుండి న్యూయార్క్ లోని లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం(Liberty International Airport)కు వారానికి ఐదు సార్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా ఎండీ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(MD&CEO) క్యాంప్ బెల్ విల్సన్(Campbell Wilson) తెలిపారు. కాగా ప్రస్తుతం ఎయిర్ ఇండియా వద్ద ఆరు ఎయిర్ బస్ ఏ350-900 విమానాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ శాతం విమానాలను అమెరికాలోని ప్రధాన నగరాలకు నడుపుతోంది. కాగా ఆ సంస్థ ఇటీవలే ఈ నెల 15 నుంచి డిసెంబర్ 31 వరకు 60 విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మెయింటెనెన్స్, సప్లయ్ చెయిన్ వంటి సమస్యల కారణంగా వీటిని క్యాన్సల్ చేస్తున్నట్లు తెలిపింది.