Air India: మరో 100 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చిన ఎయిరిండియా..!

దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్(Famous Airlines), టాటా గ్రూప్(Tata Group) కంపెనీకి చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా(Air India) ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను మరింత విస్తరించే పనిలో ఉంది.

Update: 2024-12-09 15:00 GMT
Air India: మరో 100 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చిన ఎయిరిండియా..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్(Famous Airlines), టాటా గ్రూప్(Tata Group) కంపెనీకి చెందిన విమానయాన సంస్థ ఎయిర్ఇండియా(Air India) ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను మరింత విస్తరించే పనిలో ఉంది. అందులో భాగంగా యూరప్(Europe)కు చెందిన విమాన తయారీ కంపెనీ ఎయిర్‌బస్‌(Airbus) నుంచి మరో 100 కొత్త విమానాలను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ఇందులో 90 నారో బాడీ(Narrow Body) A320 విమానాలు, 10 వైడ్ బాడీ(Wide Body) A350 విమానాలు ఉన్నాయి. అలాగే విమానాల కొనుగోలుతో పాటు A350 విమాన విడిభాగాలు(Aircraft parts), మెయింటెనెన్స్(Maintenance) కోసం ఎయిర్‌బస్‌ తో ఒప్పందం కుదర్చుకున్నట్లు టాటా గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఎయిరిండియా గత ఏడాది ఫిబ్రవరిలో 470 విమానాల కొనుగోలు కోసం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఎయిర్‌బస్ నుండి 250, బోయింగ్(Boing) నుండి 220 విమానాలు ఉన్నాయి. ఈ ఆర్డర్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సింగిల్-ట్రాంచ్ ఎయిర్‌క్రాఫ్ట్(Single-Tranche Aircraft) కొనుగోలుగా చరిత్ర సృష్టించింది.

Tags:    

Similar News