Air India: మరో 85 విమానాలను ఆర్డర్ ఇచ్చిన ఎయిరిండియా..!
దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్(Famous Airlines), టాటా గ్రూప్(Tata Group) కంపెనీకి చెందిన ఎయిర్ఇండియా(Air India) ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను మరింత విస్తరించే పనిలో ఉంది.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్(Famous Airlines), టాటా గ్రూప్(Tata Group) కంపెనీకి చెందిన ఎయిర్ఇండియా(Air India) ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను మరింత విస్తరించే పనిలో ఉంది. అందులో భాగంగా ఎయిర్‌బస్(Airbus) నుంచి మరో 85 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. ఇందులో 75 నారో బాడీ(Narrow Body) A320 విమానాలు, 10 వైడ్ బాడీ(Wide Body) A350 విమానాలు ఉన్నాయి. అయితే విమానాల కొనుగోలు విషయాన్ని ఎయిరిండియా, ఎయిర్‌బస్ ఇప్పటివరకు అధికారంగా ప్రకటించలేదు. కాగా ఎయిరిండియా గత ఏడాది ఫిబ్రవరిలో 470 విమానాల కొనుగోలు కోసం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఎయిర్‌బస్ నుండి 250, బోయింగ్ నుండి 220 విమానాలు ఉన్నాయి. ఈ ఆర్డర్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సింగిల్-ట్రాంచ్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలుగా చరిత్ర సృష్టించింది.