Adani Group: అల్యూమినియం వ్యాపారంలోకి అదానీ!
Adani Group to Enter Aluminium Business| భారత్, ఆసియా అత్యంత సంపన్నుడు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరో వ్యాపారంలో అడుగుపెట్టారు. ఇప్పటికే అనేక వ్యాపారాలకు సంస్థ కార్యకలాపాలను విస్తరించిన అనంతరం, తాజాగా అల్యూమినియం రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తోంది
న్యూఢిల్లీ: Adani Group to Enter Aluminium Business| భారత్, ఆసియా అత్యంత సంపన్నుడు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరో వ్యాపారంలో అడుగుపెట్టారు. ఇప్పటికే అనేక వ్యాపారాలకు సంస్థ కార్యకలాపాలను విస్తరించిన అనంతరం, తాజాగా అల్యూమినియం రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఒడిశాలో సుమారు రూ. 41.41 వేల కోట్ల(5.2 బిలియన్ డాలర్ల)తో అల్యూమినియం రిఫైనరీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. కానీ, కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
గతేడాది చివర్లో అదానీ గ్రూప్ ఓ కొత్త అనుబంధ సంస్థ ముంద్రా అల్యూమినియం లిమిటెడ్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఈ వ్యాపారంలో ప్రవేశించనున్నట్టు సంకేతాలిచ్చింది. ప్రస్తుతానికి ఈ రంగంలో వేదాంత రిసోర్సెస్, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థలు ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పటికే పలు రంగాల వ్యాపారాల్లోకి వేగవంతంగా విస్తరిస్తున్న అదానీ గ్రూప్ ఇటీవల టెలికాం రంగంలో సొంత వ్యాపారాల అవసరాల కోసం 5జీ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. అంతేకాకుండా దిగ్గజ సిమెంట్ తయారీ సంస్థ హోల్సిమ్ లిమిటెడ్‌కు చెందిన భారత విభాగాన్ని కొనుగోలు చేసి సిమెంట్ తయారీలోకి కూడా అడుగు పెట్టారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ రాగి, ఉక్కు తయారీని ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: అది జోక్ మాత్రమే.. ఉపరాష్ట్రపతి కావాలనే వ్యాఖ్యలపై బీహార్ సీఎం క్లారిటీ..