రూ.1,000 కోట్ల సమీకరణను విరమించుకున్న అదానీ ఎంటర్ ప్రైజెస్

అదానీ ఎంటర్ ప్రైజెస్ కీలక నిర్ణయం తీసుకుంది. బాండ్ల విక్రయం ద్వారా రూ.1,000 కోట్లు ($121.65 మిలియన్లు) సేకరించే ప్రణాళికను విరమించుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Update: 2023-02-04 11:54 GMT

ముంబై: అదానీ ఎంటర్ ప్రైజెస్ కీలక నిర్ణయం తీసుకుంది. బాండ్ల విక్రయం ద్వారా రూ.1,000 కోట్లు ($121.65 మిలియన్లు) సేకరించే ప్రణాళికను విరమించుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, AK క్యాపిటల్, JM ఫైనాన్షియల్, ట్రస్ట్ క్యాపిటల్‌తో కలిసి అదానీ ఎంటర్ ప్రైజెస్ జనవరి నెలలో పబ్లిక్ నోట్‌ను జారీ చేయాలని ప్లాన్ చేసింది, కానీ ఇటీవల అదానీ గ్రూప్‌లో జరుగుతన్న పరిణామాలతో బాండ్ల విక్రయ ప్రణాళికను విరమించుకున్నట్లు సమాచారం. US-ఆధారిత షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణల కారణంగా, ఇటీవల 200 బిలియన్ రూపాయల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను కూడా నిలిపివేశారు.

Tags:    

Similar News