అనుబంధానికి అష్ట సూత్రాలు

దిశ, వెబ్ డెస్క్: మనిషి ప్రయాణం ‘బంధాల’తో సాగుతుంది. అది జీవితంలోనైనా, వ్యాపారంలోనైనా.. ఎక్కడైనా సరే..బాండింగ్‌లో అండర్‌స్టాండింగ్ ఉంటే అదిరిపోయే రిజల్ట్ వస్తుంటాయి. అలా గుడ్ రిలేషన్‌షిప్ పాజిటివ్ వైబ్స్‌ను కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బిజినెస్ టైకూన్ హర్ష్ గోయెంకా వ్యాపారపరంగా ఎంత బిజీగా ఉన్నా..ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు యువతను, రాబోయే తరాలను ఉద్దేశించి మంచి సలహాలు, సూచనలు షేర్ చేస్తూ ఉంటారు. గత వారం ‘ఇంటిగ్రిటీ’ గురించి స్ఫూర్తివంతమైన కోట్‌ను అందించిన హర్ష్ ఈ సారి.. […]

Update: 2020-10-16 04:26 GMT

దిశ, వెబ్ డెస్క్: మనిషి ప్రయాణం ‘బంధాల’తో సాగుతుంది. అది జీవితంలోనైనా, వ్యాపారంలోనైనా.. ఎక్కడైనా సరే..బాండింగ్‌లో అండర్‌స్టాండింగ్ ఉంటే అదిరిపోయే రిజల్ట్ వస్తుంటాయి. అలా గుడ్ రిలేషన్‌షిప్ పాజిటివ్ వైబ్స్‌ను కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బిజినెస్ టైకూన్ హర్ష్ గోయెంకా వ్యాపారపరంగా ఎంత బిజీగా ఉన్నా..ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు యువతను, రాబోయే తరాలను ఉద్దేశించి మంచి సలహాలు, సూచనలు షేర్ చేస్తూ ఉంటారు. గత వారం ‘ఇంటిగ్రిటీ’ గురించి స్ఫూర్తివంతమైన కోట్‌ను అందించిన హర్ష్ ఈ సారి.. గుడ్ రిలేషన్‌షిప్ మెయింటెయిన్ చేయడానికి అష్ట సూత్రాలను ప్రతిపాదించాడు. అయితే, హర్ష్ వ్యాపార అనుబంధాలను గురించి కాకుండా…భార్యాభర్తలు, ప్రేమికుల రిలేషన్‌షిప్‌ బలపడటానికి ఈ టిప్స్ అందించాడు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

https://twitter.com/hvgoenka/status/1316596742427570179

1.ఎక్స్‌ప్రెస్ యువర్ ఫీలింగ్స్:

ఏ బంధంలోనైనా సరే మన ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడం చాలా ముఖ్యం. మన మనసులోని భావనలను క్లియర్‌గా చెప్పినప్పుడే అవతలి వ్యక్తికి కూడా మన గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, మరింత అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది. మన ఫీలింగ్స్‌ను హర్ట్ చేయకుండా ఇద్దరూ హెల్తీ రిలేషన్‌షిప్ మెయింటెయిన్ చేయొచ్చు.

2. ఫర్‌గివ్ క్విక్లీ…

మనుషులే తప్పు చేస్తారు అనే మాట చాలా సార్లు వినే ఉంటాం. అందుకనే..తప్పు చేసిన మనుషులు వెంటనే రిగ్రెట్ అయ్యి క్షమాపణ చెబితే..ఆ బంధం మరింత బలపడుతుంది. ఎంత త్వరగా తమ తప్పు తెలుసుకుని సారీ చెబితే.. అంత మంచిది. ఓ రెండక్షరాల మాట..రెండు నిండు జీవితాలను ఎంతో సంతోషంగా ఉంచుతుందంటే.. ఆ చిన్న మాటను చెప్పడానికి ఎప్పుడూ సంశయించొద్దు.

3. ఎంకరేజ్ అదర్స్ గ్రోత్..

ఓ రిలేషన్‌షిప్‌లో ప్రధానంగా ‘ఈగో’ ఉండకూడదు. ఒకరు ఎదుగుతుంటే.. మరొకరు తమకు చేతనైంత సాయం అందించాలి. అంతేకాదు..వారికి ఎదుగుదలకు బూస్టప్ చేయాలి. తగిన ప్రోత్సాహం అందించాలి. అంతేకాని..ఒకరి అభివృద్ధిని చూసి మరొకరు అసూయ పడకూడదు.

4. లెర్న్ టూ ట్రస్ట్..

బంధానికి పునాది నమ్మకమే. ఆ నమ్మకమే ఆ బంధాన్ని చివరంచుల వరకు సాగేలా చేస్తోంది. ఏ నిముషంలో నమ్మకాన్ని కోల్పోతామో.. బంధాన్ని కూడా కోల్పోతాము. కాబట్టి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.

5. అడ్మిట్ యువర్ వీక్‌నెస్..

ప్రతి ఒక్కరికీ తమవైన స్ట్రెంత్స్ ఉన్నట్లే..వీకనెసెస్ కూడా ఉంటాయి. అందుకే ఎదుటి వారికి మన బలహీనతలు ముందే చెప్పేస్తే.. వాటిని బలంగా మార్చుకునేందుకు సాయం చేయొచ్చు. లేదా ఆ బలహీనతలతో ఆటపట్టించకుండా ఉండొచ్చు.

6. లెస్సెన్ ఎక్సెపెక్టేషన్

మనకు చాలా కోరికలు ఉంటాయి. అవి నెరవేరితే.. ఎంత ఆనందంగా ఉంటుందో.. అవి చేజారినప్పుడు అంతకు రెట్టింపు బాధ కలుగుతుంది. ఒకరి నుంచి మనం ఎక్కువగా ఆశించి.. ఆ ఎక్సెపెక్టేషన్ రీచ్ కాకపోతే.. ఆ క్షణాన్ని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఎక్సెపెక్టేషన్ పెట్టుకోకపోవడం ఉత్తమం. బుద్ధుడు కూడా అదే చెబుతాడు కోరికలే దు:ఖానికి హేతువు అని.

7. సమ్‌థింగ్ కెన్‌నాట్ చేంజ్, వన్ నీడ్స్ టు యాక్సెప్ట్..

సమాజంలోనే కాదు…మనం ఎదుటి వ్యక్తిలోనూ మార్పును కోరుకుంటాం. కానీ, ఆ మార్పు సాధ్యపడనప్పుడు మంచి మనసుతో యాక్సెప్ట్ చేయగలగాలి. మార్పు కోరుకోవాలి, ఆ మార్పును తీసుకు రావడానికి వీలైనన్నీ సార్లు ప్రయత్నించాలి. అప్పుడు కూడా మనవల్ల కాదు.. మార్పు రాదు అని తెలిసిన మరుక్షణమే.. దాన్ని కూడా అంగీకరిస్తే..రిలేషన్‌షిప్‌కు విలువనిచ్చినవాళ్లమవుతాం.

8. మ్యూచువల్ రెస్పెక్ట్

ఒకరిని ఒకరు గౌరవించుకోవడం చాలా చాలా ముఖ్యం. వ్యక్తిపరంగానే కాదు, వృత్తిపరంగాను. చాలా సందర్భాల్లో గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మరిచి మాట్లాడుతుంటాం. ఆ తర్వాత ఎదుటి వాళ్లు అన్నమాటలకు చింతిస్తుంటాం. అందుకే..ఎలాంటి సందర్భాల్లోనైనా సరే.. మ్యూచువల్ రెస్పెక్టె మెయింటెయిన్ చేయాలి.

 

Tags:    

Similar News