లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహారాష్ట్రలోని నందుర్ బార్ దగ్గర కొండైబరి ఘాట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు 40 అడుగుల లోయలో పడి నలుగురు మృతిచెందారు. మరో 35 మందికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు సమాచారం. ఈ ఘటన మహారాష్ట్ర నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహారాష్ట్రలోని నందుర్ బార్ దగ్గర కొండైబరి ఘాట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు 40 అడుగుల లోయలో పడి నలుగురు మృతిచెందారు. మరో 35 మందికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు సమాచారం. ఈ ఘటన మహారాష్ట్ర నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.