చేవెళ్లలో పదేళ్లుగా తీరని సమస్య.. పట్టించుకొని అధికారులు.
దిశ, చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ నుంచి పార్లమెంట్ స్థానానికి మారినప్పటికీ చేవెళ్ల పట్టణంలో బస్‌డిపో ఏర్పాటు చేయలేదు. బస్ డిపో కోసం శంకుస్థాపన చేసిన దాదాపు 10 సంవత్సరాలు అయినా బస్ డిపో లేకపోవడం ఈ ప్రాంత నాయకులు,అధికారుల పనితీరుకు నిదర్శనం. చేవెళ్ల బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడం, మురుగుదొడ్లు, మూత్రశాలలు సరిపడ లేకపోవడం, కూర్చోవడానికి కూడా సరి పడ కుర్చీలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేవెళ్ల బస్ డిపో ఏర్పాటు […]
దిశ, చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ నుంచి పార్లమెంట్ స్థానానికి మారినప్పటికీ చేవెళ్ల పట్టణంలో బస్‌డిపో ఏర్పాటు చేయలేదు. బస్ డిపో కోసం శంకుస్థాపన చేసిన దాదాపు 10 సంవత్సరాలు అయినా బస్ డిపో లేకపోవడం ఈ ప్రాంత నాయకులు,అధికారుల పనితీరుకు నిదర్శనం. చేవెళ్ల బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడం, మురుగుదొడ్లు, మూత్రశాలలు సరిపడ లేకపోవడం, కూర్చోవడానికి కూడా సరి పడ కుర్చీలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేవెళ్ల బస్ డిపో ఏర్పాటు కోసం గతంలో వచ్చిన ప్రతిపాదన వచ్చాయి. దీనిపై ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేవెళ్ల మండలం లోని దామరగిద్ద గ్రామ రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల భూమిని కేటాయించిన భూమిలో బస్ డిపో దిమ్మెలను ఏర్పాటు చేశారు.
మంజూరైన బస్ డిపోను ఏర్పాటు చేయడంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రగతి లేకపోవడం ప్రజలు తప్పుపడుతున్నారు. వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి, శంకర్ పల్లి, షాద్నగర్, హైదరాబాద్ నుంచి సాయంత్రం 8 తర్వాత బస్సులు లేకపోవడంతో ఏజెన్సీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేవెళ్ల ప్రాంత ప్రజలు నిత్యం అనేక అవసరాల నిమిత్తం వికారాబాద్, హైదరాబాద్, పరిగి, శంకర్ పల్లి, షాద్నగర్ వెళ్తుంటారు. వారికి సరైన బస్ సర్వీస్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా చొరవ చూపించి సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.