కేసీఆర్ కు షాక్.. యూనివర్శిటీలో దిష్టిబొమ్మ దహనం..

దిశ, సికింద్రాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలపాలనే కేసీఆర్, జగన్ మోహాన్ రెడ్డిల కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలో కలపాలన్న ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ ఎన్సీసీ గేటు వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలను కలపాలనే దుర్భుద్దిలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీలో తెలంగాణ తల్లిని విస్మరించి, తెలుగు […]

Update: 2021-10-29 09:36 GMT

దిశ, సికింద్రాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలపాలనే కేసీఆర్, జగన్ మోహాన్ రెడ్డిల కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలో కలపాలన్న ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ ఎన్సీసీ గేటు వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలను కలపాలనే దుర్భుద్దిలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీలో తెలంగాణ తల్లిని విస్మరించి, తెలుగు తల్లి చిత్రపటం పెట్టారన్నారు. ఎంతో మంది అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రలో కలపాలనే వ్యాఖ్యలు చేసిన పేర్నినాని ని బొందపెట్టడం ఖాయమన్నారు.

తెలంగాణ ప్రాంతం వాడైన కేసీఆర్ రాష్ట్రానికి ద్రోహంచేస్తే ఊరుకోబోమన్నారు. అప్పుడు సీమాంధ్ర పాలనలో పెనం మీద నుండి ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో పొయ్యిలో పడ్డామన్నారు. సీమాంధ్రులు తెలంగాణలో మళ్ళీ రాజకీయ పెత్తనం కోసం ఆరాటపడటం అనైతికమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొప్పుల ప్రతాపరెడ్డి, డాక్టర్ గడ్డం శ్రీనివాస్, భట్టు శ్రీహరి నాయక్, చరణ్ కౌషిక్ యాదవ్, బైరు నాగరాజు గౌడ్, భిక్షునాయక్, రెడ్డి శ్రీనివాస్, మదన్, కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News