ఈ నెల 14న బుమ్రా పెళ్లి?.. కాబోయే భార్య ఆమెనే?

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వివాహంపై గత కొద్దిరోజులుగా మీడియాలో అనేక వార్తలు హాల్‌చల్ చేస్తున్నాయి. గతంలో హీరోయిన్ రాశీఖన్నాతో బుమ్రా లవ్‌లో ఉన్నాడనే ప్రచారం జరగ్గా.. ఇటీవల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు వైరల్‌గా మారాయి. దీనిపై క్లారిటీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీతా పరమేశ్వరన్.. అనుపమ, బుమ్రా కేవలం స్నేహితులు మాత్రమేనని, వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల్లో నిజం లేదంది. […]

Update: 2021-03-09 00:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వివాహంపై గత కొద్దిరోజులుగా మీడియాలో అనేక వార్తలు హాల్‌చల్ చేస్తున్నాయి. గతంలో హీరోయిన్ రాశీఖన్నాతో బుమ్రా లవ్‌లో ఉన్నాడనే ప్రచారం జరగ్గా.. ఇటీవల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు వైరల్‌గా మారాయి. దీనిపై క్లారిటీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీతా పరమేశ్వరన్.. అనుపమ, బుమ్రా కేవలం స్నేహితులు మాత్రమేనని, వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల్లో నిజం లేదంది. దీంతో ఆ వార్తలకు అంతటితో ఫుల్‌స్టాప్ పడిపోయింది.

ఈ క్రమంలో బుమ్రా పెళ్లి గురించి మరో వార్త మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఈ నెల 14న గోవాలో బుమ్రా పెళ్లి జరగనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకు బుమ్రాకు కాబోయే భార్య ఎవరో తెలుసా?.. కోల్‌కతా నైట్‌రైడర్స్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజనా గణేశన్‌ను బుమ్రా పెళ్లాడనున్నాడట.

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు వ్యక్తిగత కారణాలతో బుమ్రాను సెలవులపై బీసీసీఐ పంపింది. అలాగే త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న టీ 20 సిరీస్‌ నుంచి కూడా బుమ్రా తప్పుకున్నాడు. దీంతో పెళ్లి కోసమే బుమ్రా సెలవులు తీసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News