IPL : ఆ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బంపర్ ఆఫర్ ఇచ్చిన ఫ్రాంచైజీ!
దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2022 సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో మరో రెండు కొత్త ఫ్రాంచైజీలు సైతం బరిలో దిగుతుండటంతో మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఫ్రాంచైజీల్లో ప్లేయర్స్ ఎవరుంటారో అనే ఆసక్తి నెలకొంది. అయితే అహ్మదాబాద్ జట్టు తీసుకున్న నిర్ణయం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాడైన శ్రేయస్ అయ్యర్‌తో పాటు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడను జట్టులోకి తీసుకోడానికి భారీగా […]
దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2022 సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో మరో రెండు కొత్త ఫ్రాంచైజీలు సైతం బరిలో దిగుతుండటంతో మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఫ్రాంచైజీల్లో ప్లేయర్స్ ఎవరుంటారో అనే ఆసక్తి నెలకొంది. అయితే అహ్మదాబాద్ జట్టు తీసుకున్న నిర్ణయం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాడైన శ్రేయస్ అయ్యర్‌తో పాటు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడను జట్టులోకి తీసుకోడానికి భారీగా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్‌గా అయ్యర్‌కు ఛాన్స్ ఇస్తున్నట్టు సమాచారం. ఇందు కోసం అయ్యర్‌కు రూ. 15 కోట్లు, రబాడకి 10 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా రిటైన్ ప్రక్రియ ముగియక ముందే నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ఆటగాళ్ళతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు మిగిలిన జట్టు యాజమాన్యాలు ఇప్పటికే బిసీసీఐకి ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలోనే లక్నో జట్టు యాజమాన్యం కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో వారిద్దరిపై ఏడాది కాలం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్ జట్టు కూడా అదేదారిలో వెళ్తున్నట్లు తెలుస్తున్నది.