బంగారంపై దిగుమతి సుంకం తగ్గింపు!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం బంగారం, వెండి ధరలకు సంబంధించి కీలక నిర్ణయాలను వెల్లడించింది. పసిడిపై కస్టమ్స్ డ్యూటీని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించారు. దీంతో బంగారం కొనుగోలుదారులకు ఊరట లభించింది. 2019లో దిగుమతి సుంకాన్ని పెంచిన తర్వాత బంగారం, వెండి లోహాల ధరలు పెరిగాయి. వాటిని క్రితం ధరలు చేర్చేందుకు కస్టమ్స్ సుంకాని తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. అయితే, అగ్రి సెస్ 2.5 శాతం నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం బంగారం, వెండి ధరలకు సంబంధించి కీలక నిర్ణయాలను వెల్లడించింది. పసిడిపై కస్టమ్స్ డ్యూటీని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించారు. దీంతో బంగారం కొనుగోలుదారులకు ఊరట లభించింది. 2019లో దిగుమతి సుంకాన్ని పెంచిన తర్వాత బంగారం, వెండి లోహాల ధరలు పెరిగాయి. వాటిని క్రితం ధరలు చేర్చేందుకు కస్టమ్స్ సుంకాని తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. అయితే, అగ్రి సెస్ 2.5 శాతం నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ భారాన్ని తగ్గించేందుకే కస్టమ్స్ సుంకాన్ని తగ్గించామని వివరించారు. బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని తగ్గింపు పట్ల జ్యువెలరీ పరిశ్రమ నుంచి సాంకూలంగా స్పందన వినిపిస్తోంది. రత్నాలు, బంగారు ఆభరణాల వ్యాపారుల దీర్ఘకాలిక డిమాండ్‌ను తీర్చుస్తూ దిగుమతి సుంకాన్ని తగ్గించడం మంచి నిర్ణయమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా బంగారం అక్రమ లావాదేవీలను నియంత్రించేందుకు ఈ-గవర్నెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరుతోంది.
కాగా, బంగారంపై దిగుమతి సుంకం తగ్గింపు నేపథ్యంలో సోమవారం బంగారం ధరలు తగ్గాయి. హైదరబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 320 తగ్గి రూ. 49,640గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 310 తగ్గి రూ. 45,500గా ఉంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే..దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,270 ఉండగా, వాణిజ్య రాజధాని ముంబైలో రూ. 49,450, చెన్నైలో రూ. 50,450, కోల్‌కతాలో రూ. 50,700, బెంగళూరులో రూ. 49,640 గా ఉంది.