‘ఉత్తరాంధ్రలో వైసీపీ ఎంపీ అరాచకాలు’
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాంధ్రలో బలహీన వర్గాలను టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వారిని భయపెట్టి, ఆస్తులను కొల్లగొడుతున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా సోషల్ మీడియాలో మాట్లాడిన ఆయన.. అక్రమ కేసుల పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇదే ప్రాంతంలో ఎన్నో ఏండ్లుగా ప్రజల ఆదరణ పొందిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వారి అనుచరులపైన కూడా కేసులు పెడుతూ.. రౌడీషీట్‌లు ఓపెన్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాంధ్రలో బలహీన వర్గాలను టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వారిని భయపెట్టి, ఆస్తులను కొల్లగొడుతున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా సోషల్ మీడియాలో మాట్లాడిన ఆయన.. అక్రమ కేసుల పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇదే ప్రాంతంలో ఎన్నో ఏండ్లుగా ప్రజల ఆదరణ పొందిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వారి అనుచరులపైన కూడా కేసులు పెడుతూ.. రౌడీషీట్‌లు ఓపెన్ చేయడం దారుణమన్నారు. అటువంటి రాజకీయ ప్రస్థానం కలిగిన కుటుంబం పరిస్థితే ఇలా ఉంటే.. ఉత్రరాంధ్రలో సామాన్యుల పరిస్థితి ఏంటని బుద్ధా వెంకన్న విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.
Sri @BuddaVenkanna addressing the media about illegal cases that the YSRCP Government is filing against TDP Leaders – LIVE
https://t.co/xRCjPF3jSM— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) June 23, 2021