పాత కక్షలతో దారుణ హత్య…
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పాత కక్షలతో ఆదివారం ఓ వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో దారుణ హత్యకు గురయ్యాడు. మల్లె పోగు నర్సింహులు (40) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి పెనుగొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో నర్సింహులును గుర్తించిన ప్రత్యర్థులు రాళ్ల తో దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన రమేష్ అనే వ్యక్తిని […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పాత కక్షలతో ఆదివారం ఓ వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో దారుణ హత్యకు గురయ్యాడు. మల్లె పోగు నర్సింహులు (40) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి పెనుగొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో నర్సింహులును గుర్తించిన ప్రత్యర్థులు రాళ్ల తో దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన రమేష్ అనే వ్యక్తిని కూడా కొట్టి తోసివేశారు. అనంతరం నర్సింహులును తలపై రాడ్లు, రాళ్లతో మోది హతమార్చారు.
పదిహేనేళ్ల క్రితం శాంతయ్య అనే వ్యక్తి హత్య కేసులో దోషిగా ఉన్న నర్సింహులు కొన్ని రోజుల క్రితమే జైలు నుండి విడులయ్యాడు. ఈ విషయం తెలిసిన శాంతయ్య కుమారులైన నాగభూషణం, శివరాజ్ లు నర్శింహులును హత్యచేయడానికి ప్లాన్ వేసుకొని హతమార్చినట్లు పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. విషయం తెలిసిన వెంటనే రూరల్ సీఐ మహేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. డీఎస్పీ శ్రీధర్ సైతం సంఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన వివరాలపై ఆరా తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.