ఉప్పెన సీన్ రిపీట్.. ప్రేమికుడి మర్మాంగాన్ని కోసి..
దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైన తన చెల్లిని ప్రేమించిన అతన్ని మందలిస్తారు లేదా కొట్టి మరోసారి తన జోలికి రాకుండా వార్నింగ్ ఇస్తారు. కానీ బీహార్ రాష్ట్రం ముజఫర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన చెల్లిని ప్రేమించాడు అనే ఒకే ఒక కారణంతో యువకుడిని, యువతి సోదరలు ఏం చేశారో తేలుస్తే షాక్ అవుతారు. ఉప్పెన సీనిమాలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో హిరోయిన్ తండ్రి హీరోను ఏం చేస్తాడో అదే సీన్ బీహార్ రాష్ట్రంలో […]
దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైన తన చెల్లిని ప్రేమించిన అతన్ని మందలిస్తారు లేదా కొట్టి మరోసారి తన జోలికి రాకుండా వార్నింగ్ ఇస్తారు. కానీ బీహార్ రాష్ట్రం ముజఫర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన చెల్లిని ప్రేమించాడు అనే ఒకే ఒక కారణంతో యువకుడిని, యువతి సోదరలు ఏం చేశారో తేలుస్తే షాక్ అవుతారు. ఉప్పెన సీనిమాలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో హిరోయిన్ తండ్రి హీరోను ఏం చేస్తాడో అదే సీన్ బీహార్ రాష్ట్రంలో రిపీట్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్లితే.. రామ్పురుశాహ్ ప్రాంతానికి చెందిన సౌరభ్ రాజ్(22), సోనావర్ష గ్రామానికి చెందిన ఓ యవతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను యవతి సోదరులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఎంత చెప్పినా వారు వినకపోయేసరికి ఆగ్రహానికిలోనైన యువతి సోదరలు దారుణానికి ఒడిగట్టారు. గుట్టుచప్పుడు తన చెల్లి వారింటికి రమ్మన్నట్టు సౌరభ్‌ను ఇంటికి పిలిపించుకున్నారు. కొద్ది సేపు అతనితో సఖ్యతగా మాట్లాడి అనంతరం అతన్ని ఓ రూమ్‌లో బంధించారు. తర్వాత అతని మర్మాంగాన్ని కోసి, చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. తన చెల్లిని ప్రేమించాడని ఒకే కారణంతో యువకుడి మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టి చంపేయడంపై యువకుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ యువతి ఇంటి ముందే యువకుడి అంత్యక్రియలు చేస్తూ నిరసనకు దిగారు.