కారుతో ఢీ కొట్టిన చావలేదు.. కత్తితో నరికి చంపాడు

దిశ, నాగర్ కర్నూల్: ఆస్తి తగాదాల నేపథ్యంలో తోడబుట్టిన అన్నని ఓ తమ్ముడు అత్యంత పాశవికంగా చంపిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఆన్కాన్పల్లిలో చోటుచేసుకుంది. సొంత అన్న అనే కనికరం లేకుండా కారుతో యాక్సిడెంట్ చేసి, కాలు నరికి విచక్షణారహితంగా చంపాడు. వివరాల్లోకి వెళితే.. అన్కాన్ పల్లికి చెందిన భగవత్ హనుమంతు నాయక్(40) బుధవారం రాత్రి తన స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో సొంత తమ్ముడు శంకర్ నాయక్ కారుతో యాక్సిడెంట్ చేశాడు. […]

Update: 2021-03-04 08:06 GMT

దిశ, నాగర్ కర్నూల్: ఆస్తి తగాదాల నేపథ్యంలో తోడబుట్టిన అన్నని ఓ తమ్ముడు అత్యంత పాశవికంగా చంపిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఆన్కాన్పల్లిలో చోటుచేసుకుంది. సొంత అన్న అనే కనికరం లేకుండా కారుతో యాక్సిడెంట్ చేసి, కాలు నరికి విచక్షణారహితంగా చంపాడు. వివరాల్లోకి వెళితే.. అన్కాన్ పల్లికి చెందిన భగవత్ హనుమంతు నాయక్(40) బుధవారం రాత్రి తన స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో సొంత తమ్ముడు శంకర్ నాయక్ కారుతో యాక్సిడెంట్ చేశాడు. గాయాలతో బాధపడుతున్నా కోపంతో ఊగిపోతూ తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో కుడి కాలు నరికి వేశాడు. అంతటితో ఆగకుండా కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ హత్యకు ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది. మృతుని భార్య భామిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ గాంధీ నాయక్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News