బ్రిటన్ ప్రధాని భారత పర్యటన రద్దు

లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు చేసుకున్నారు. భారత, బ్రిటన్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రకటనను సోమవారం విడుదల చేశాయి. కరోనా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే వారం భారత్‌లో ప్రధాని బోరిస్ జాన్సన్ చేయనున్న పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ఆ ప్రకటన వివరించింది. ఈ పర్యటనకు బదులు ఉభయదేశాల ప్రధానులు త్వరలో ఆన్‌లైన్‌లో లేదా ఫోన్‌లో మాట్లాడతారని, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొంది. తర్వాత కూడా వీరిరువురూ […]

Update: 2021-04-19 05:13 GMT

లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు చేసుకున్నారు. భారత, బ్రిటన్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రకటనను సోమవారం విడుదల చేశాయి. కరోనా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే వారం భారత్‌లో ప్రధాని బోరిస్ జాన్సన్ చేయనున్న పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ఆ ప్రకటన వివరించింది. ఈ పర్యటనకు బదులు ఉభయదేశాల ప్రధానులు త్వరలో ఆన్‌లైన్‌లో లేదా ఫోన్‌లో మాట్లాడతారని, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొంది.

తర్వాత కూడా వీరిరువురూ టచ్‌లో ఉంటారని, ఈ ఏడాది ద్వితీయార్థంలో చేయాల్సిన పర్యటనపై మాట్లాడతారని వివరించింది. బ్రిటన్ ప్రధాని ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికే భారత్‌కు రావల్సింది. కానీ, ఆయనకు కరోనా రావడంతో ఆ పర్యటన వాయిదా పడింది. తాజాగా, ఏప్రిల్ 25న మూడు రోజులు మనదేశంలో పర్యటించడానికి షెడ్యూల్ ఖరారైంది. అయితే, కరోనా విజృంభిస్తుండటంతో ఇటీవలే ఈ పర్యటనను కుదిస్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. తాజాగా, ఆ పర్యటనను రద్దు చేస్తున్నట్టు వివరించింది.

Tags:    

Similar News