కరోనా ఎఫెక్ట్.. బ్రిస్బేన్ టెస్టు జరిగేనా?

దిశ, స్పోర్ట్స్ : బ్రిస్బేన్‌లో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కావల్సిన నాలుగో టెస్టుపై ఇంకా సందిగ్దత నెలకొన్నది. టీమ్ ఇండియా ఆటగాళ్లకు క్వారంటైన్ ఆంక్షల నుంచి సడలింపు ఇవ్వాలని గురువారమే క్రికెట్ ఆస్ట్రేలియాకు బీసీసీఐ లేఖ రాసింది. ఇదిలా ఉండగానే బ్రిస్బేన్‌లో కరోనా కేసులు పెరిగిపోతుండటతో మూడు రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బ్రిస్బేన్‌లో యూకే స్ట్రెయిన్ కేసు నమోదవడంతో అక్కడ ఆందోళన నెలకొన్నది. దీంతో […]

Update: 2021-01-08 00:44 GMT

దిశ, స్పోర్ట్స్ : బ్రిస్బేన్‌లో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కావల్సిన నాలుగో టెస్టుపై ఇంకా సందిగ్దత నెలకొన్నది. టీమ్ ఇండియా ఆటగాళ్లకు క్వారంటైన్ ఆంక్షల నుంచి సడలింపు ఇవ్వాలని గురువారమే క్రికెట్ ఆస్ట్రేలియాకు బీసీసీఐ లేఖ రాసింది. ఇదిలా ఉండగానే బ్రిస్బేన్‌లో కరోనా కేసులు పెరిగిపోతుండటతో మూడు రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బ్రిస్బేన్‌లో యూకే స్ట్రెయిన్ కేసు నమోదవడంతో అక్కడ ఆందోళన నెలకొన్నది. దీంతో స్థానిక ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో టీమ్ ఇండియా అడిగినట్లు నిబంధనలు సడలించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అదే జరిగితే నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లో జరగడం కష్టమే. మరి మూడో మ్యాచ్‌ను రద్దు చేస్తారా లేదా సిడ్నీలోనే ఆడిస్తారా అనేది తేలాల్సి ఉన్నది.

Tags:    

Similar News