ఆనందాలను అపూర్వ జ్ఞాపకాలుగా మార్చే ‘గోనట్స్’
దిశ, ఫీచర్స్: ఇద్దరు స్నేహితురాళ్లు మహి, నవ్య కలిసి ఓ ఎడ్ టెక్ స్టార్టప్ కోసం రూ.రెండు కోట్లు సేకరించారు. వారికది సెలబ్రేషన్ మూమెంట్ కాబట్టి వారి నవ్వులకు, మరింత ఆనందాన్ని అందివ్వాలనుకున్నాడు వారి ఫ్రెండ్ సుజిత్. మహి, నవ్య బాలీవుడ్ టాప్ సింగర్ అర్జిత్ సింగ్‌కు వీరాభిమానులు. ఈ నేపథ్యంలో అతడితోనే వాళ్లిద్దరిని అభినందిస్తూ, ఫ్యూచర్‌లో సూపర్ సక్సెస్ సాధించాలని చెప్పే పర్సనలైజ్ వీడియోను సుజిత్ వారికి షేర్ చేసి వాళ్లిద్దరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇక్కడ […]
దిశ, ఫీచర్స్: ఇద్దరు స్నేహితురాళ్లు మహి, నవ్య కలిసి ఓ ఎడ్ టెక్ స్టార్టప్ కోసం రూ.రెండు కోట్లు సేకరించారు. వారికది సెలబ్రేషన్ మూమెంట్ కాబట్టి వారి నవ్వులకు, మరింత ఆనందాన్ని అందివ్వాలనుకున్నాడు వారి ఫ్రెండ్ సుజిత్. మహి, నవ్య బాలీవుడ్ టాప్ సింగర్ అర్జిత్ సింగ్‌కు వీరాభిమానులు. ఈ నేపథ్యంలో అతడితోనే వాళ్లిద్దరిని అభినందిస్తూ, ఫ్యూచర్‌లో సూపర్ సక్సెస్ సాధించాలని చెప్పే పర్సనలైజ్ వీడియోను సుజిత్ వారికి షేర్ చేసి వాళ్లిద్దరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇక్కడ సుజిత్‌కు అర్జిత్‌తో పరిచయం లేదు, వాళ్లిద్దరి మధ్య అసలు ఏ కనెక్షన్ కూడా లేదు. మరి అతడు అర్జిత్‌ను ఎలా కలుసుకున్నాడు? ఈ వీడియో కోసం అతడు ఎంత సమయం వెచ్చించాడు? అసలు అర్జిత్ తనను కలవడానికి అతడిని అనుమతిస్తారా? ఒకవేళ అనుమతించినా విషెస్ చెప్పడానికి అంగీకరిస్తాడా? ఇందుకోసం అతడు ఎంత ఖర్చు చేశాడు? అసలు ఇదెలా సాధ్యమైంది? మీరూ చదివి తెలుసుకోండి.
సెలబ్రిటీలను దూరం నుంచైనా చూస్తే చాలని ఎంతోమంది ఆశపడుతుంటారు. కుదిరితే వాళ్లతో ఓసారి మాట్లాడాలని, వీలైతే ఓ ఫొటో దిగాలని, తమ జీవితంలో అలాంటి ఓ ఫ్యాన్ మూమెంట్ ఉండాలని కోరుకుంటారు. కానీ అది కొందరికీ మాత్రమే సాధ్యమవుతుంది. సోషల్ మీడియా వచ్చాక ఫేవరేట్ స్టార్స్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్ట్‌లతో చిట్ చాట్ చేయడానికి, లైవ్‌లో మాట్లాడానికి ఫ్యాన్స్‌కు అవకాశం దొరుకుతుంది. అయితే ఇదివరకు మాత్రం సెలబ్రిటీలను చూడటమే ఓ లైఫ్ టైమ్ గోల్‌లా ఉండేది. ఇప్పటికీ సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య ఇంటరాక్షన్ ఉన్నా ఇంకొన్ని విషయాల్లో కాస్త గ్యాప్ ఉంది. సుజిత్ కూడా అందరిలా అర్జిత్‌కు ఓ కామన్ ఫ్యాన్. కానీ తన స్నేహితులకు విషెస్ చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు అతడికి ‘గోనట్స్’ అనే స్టార్టప్ హెల్ప్ చేసింది. ఒక్క సుజిత్‌కే కాదు, ఎంతోమంది సెలబ్రిటీలకు, లెక్కలేని ఫ్యాన్స్‌కు మధ్య ‘గోనట్స్’ ఓ వారధిలా మారింది. మన జీవితంలోని మధుర జ్ఞాపకాలుగా నిలిచే సందర్భాల్లో అగ్రతారలు, ప్రముఖులు భాగమవుతూ, ఆ ఆనంద క్షణాలను మరింత అత్యద్భుతంగా మార్చేందుకు సెలబ్రిటీ పర్సనలైజ్ వీడియోలను ‘గోనట్స్’ అందిస్తోంది.
సీరియల్ ఎంట్రప్రెన్యూర్ వినమ్రా పాండియా, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వెటరన్ జోజి జార్జ్, మయాంక్ గుప్తా ‘గోనట్స్’ను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తమ వెబ్‌సైట్, యాప్ ద్వారా ప్రముఖుల నుంచి పర్సనలైజ్డ్ విషెస్, షౌటౌట్స్ బుక్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. పర్సనల్లీ క్యూరేటెడ్ వీడియోలు ప్రతి వేడుకను మరింత ప్రత్యేకమైనవిగా చేయడంతో పాటు, ఆ విషెస్ అందుకున్న వారికి జీవితకాల జ్ఞాపకాలుగా నిలుస్తాయని ఫౌండర్స్ అంటున్నారు. ఇది యూనిక్ ప్లాట్‌ఫామ్ కాగా ఇందులో మ్యూజిక్, ఫుడ్, లైఫ్ స్టైల్, టీవీ, సినిమాలు, కామెడీ, ఫిట్‌నెస్, రచయితలు, రేడియో, కొరియోగ్రాఫర్స్, క్రీడా రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖుల వీడియోలు అందిస్తోంది. ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, బెంగాళి, భోజ్‌పురి, గుజరాతి సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు అందుబాటులో ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 5,000 మంది అత్యంత ప్రభావవంతమైన, స్ఫూర్తిదాయకమైన ప్రముఖులను ‘గోనట్స్’లో భాగం చేయడానికి ప్రయత్నిస్తోంది.
చాలా కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవడానికి సెలబ్రీటీల మీద ఆధారపడతాయి. అయితే చిన్న బ్రాండ్స్ ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేవు. ఈ గ్యాప్‌ను ఫిల్ చేసి, చిన్న చిన్న షాప్‌లను కూడా శక్తిమంతం చేయడానికి గోనట్స్ ప్రయత్నిస్తోంది. లోకల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీ పర్సనలైజ్డ్ వీడియో సెండ్ చేసే అవకాశాన్ని గోనట్స్ తీసుకొచ్చింది. స్థానిక కిరాణా దుకాణాలు, సెలూన్లు, ఆభరణాల షాప్స్ ఇప్పుడు తమ లక్ష్య ప్రేక్షకులను చేరుకోవడానికి ‘గోనట్స్’ ద్వారా స్థానిక తారలు, ప్రముఖులతో మార్కెటింగ్ చేసుకోవచ్చు. మార్కెటింగ్‌లో బడ్జెట్ భారీగా అవసరమవుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఒక చిన్న వ్యాపార యజమాని ఓ స్టార్ సెలబ్రిటీని తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చు చేయలేడని గ్రహించిన ‘గోనట్స్’ అతి తక్కువ డబ్బులతో ఈ పని చేసి పెడుతోంది. ఇటీవల కాలంలో మైక్రో సెలబ్రీటీలు కూడా ఎక్కువయ్యారు. లోకల్ పరిధిలో వీరికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. వీరితో కూడా స్థానికంగా బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు.
‘మయాంక్ గుప్తా, నేను కలిసి ఓ స్నేహితుడి కుమారుడి బర్త్ డే ఫంక్షన్‌కు వెళ్లాం. అయితే ప్రముఖ కార్టూన్ క్యారెక్టర్స్ ఆ చిన్నోడికి వ్యక్తిగతంగా విషెస్ అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, లైసెన్సింగ్ లైవ్ ఈవెంట్స్ వంటి రంగాల్లో ట్రాక్ రికార్డ్ ఉన్న జోజి జార్జితో ఈ ఆలోచన పంచుకున్నాం. జార్జి కోణంలో ఇది మరింత విస్తరించి ‘గోనట్స్’గా జనవరి 2020లో ప్రారంభమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండియాలో ఫ్యాన్ క్రేజీ ఎక్కువ. క్రికెట్, సినీ సెలబ్రీటీలు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. టీవీ షోలు, ఓటీటీ, స్పోర్ట్స్ క్లబ్ లీగ్స్, సోషల్ మీడియా పుణ్యమాని మైక్రో సెలబ్రిటీలకు కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే ఇండియాలో తమ ఫేవరేట్ స్టార్స్‌ను కలుసుకోవడానికి అభిమానులు ఎంతో శ్రద్ధ, క్యూరియాసిటీని చూపిస్తారు. అందువల్లే క్యూరేటెడ్, పర్సనలైజ్డ్ స్టార్ వీడియోల కోసం ఖర్చు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కొవిడ్ క్రైసిస్ టైమ్‌లో మా ప్రయాణం ప్రారంభమైన కస్టమర్స్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. ఇప్పటి వరకు 700కు పైగా పర్సనలైజ్డ్ వీడియోలను అందించాం. పర్సనలైజ్డ్ వీడియోల ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్స్ కూడా ఈజీ అయిపోయింది’ అని గోనట్స్ కోఫౌండర్ వినమ్రా పాండియా చెప్పుకొచ్చారు.