కల్యాణ మండపం నుంచి వధువు జంప్.. సంచలనంగా పోలీసుల దర్యాప్తు
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లితంతులో ఇటీవల ఎన్నో కొత్తకొత్త వింతలు, షాకింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాళికట్టే ముందు అబ్బాయి నచ్చలేదని కొందరు, వరుడికి లెక్కలు రావని మరొకరు, గుట్కా తింటున్నాడని ఇంకొకరు పెళ్లి పీటల మీది నుంచి వెళ్లిపోయిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు పెళ్లి మండపంలో వధువరుడు డ్యాన్స్‌లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల బుల్లెట్ బండి పాటకు వధువు డ్యాన్స్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ […]
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లితంతులో ఇటీవల ఎన్నో కొత్తకొత్త వింతలు, షాకింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాళికట్టే ముందు అబ్బాయి నచ్చలేదని కొందరు, వరుడికి లెక్కలు రావని మరొకరు, గుట్కా తింటున్నాడని ఇంకొకరు పెళ్లి పీటల మీది నుంచి వెళ్లిపోయిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు పెళ్లి మండపంలో వధువరుడు డ్యాన్స్‌లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల బుల్లెట్ బండి పాటకు వధువు డ్యాన్స్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పెళ్లి కూతురు మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా అందరి కళ్లుగప్పి ఎస్కేప్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండలం బలిజపల్లెకు చెందిన యువకుడితో, తంబళ్లపల్లె మండలం కొటాల గ్రామానికి చెందిన యువతిని వివాహం నిశ్చయమైంది. వీరివెళ్లి చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరగాల్సి ఉన్నది. అక్కడి అమ్మచెరువు కల్యాణ మండపాన్ని బుక్ చేసిన బంధువులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. కల్యాణ మండపానికి వచ్చిన వధువరులకు పెళ్లితంతులో భాగంగా వధువరులకు నలుగుపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు ఆడపడుచులు. ఆ తర్వాత మంగళ స్నానానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమం రాత్రి సమయం కావడంతో పెళ్లి కూతురు బంధువుల, తల్లిదండ్రుల కళ్లుగప్పి పరారైంది.
స్నానం చేసి వచ్చిన వధువు కనిపించకపోవడంతో పెళ్లింటి వారు షాక్ తిన్నారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న వరుడు పెళ్లి పేరుతో తనను అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మాయికి పెళ్లి ఇష్టమో.. కాదో తెలుసుకోకుండా ఎందుకు ముహూర్తాలు పెట్టారని మండిపడ్డాడు. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా.. వధువు మైనర్ అని తేలింది. ఈ కారణంగా అమ్మాయి పారిపోయినట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. వధువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.