బారాత్‌లో డ్యాన్స్ చేస్తూ వరుడి మృతి

        కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన కొద్దిసేపటికే ఆ వరుడికి నిండు నూరేళ్లు నిండాయి. జీవితాంతం తోడు ఉంటానని ప్రమాణం చేసిన వధువును ఒంటరిని చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. కనీపెంచిన తల్లిదండ్రులు, ఆడుకున్న దోస్తులు, బంధువుల మధ్యే తుది శ్వాస విడిచాడు. పెండ్లి బారాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ వరుడు ప్రాణం విడిచిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ ‌జిల్లాలో చోటు చేసుకుంది. బోధన్ పట్టణానికి చెందిన మంగలి గణేశ్‌(25)కు […]

Update: 2020-02-15 02:10 GMT

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన కొద్దిసేపటికే ఆ వరుడికి నిండు నూరేళ్లు నిండాయి. జీవితాంతం తోడు ఉంటానని ప్రమాణం చేసిన వధువును ఒంటరిని చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. కనీపెంచిన తల్లిదండ్రులు, ఆడుకున్న దోస్తులు, బంధువుల మధ్యే తుది శ్వాస విడిచాడు. పెండ్లి బారాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ వరుడు ప్రాణం విడిచిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ ‌జిల్లాలో చోటు చేసుకుంది. బోధన్ పట్టణానికి చెందిన మంగలి గణేశ్‌(25)కు శుక్రవారం ఓ యువతితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా రాత్రి బారాత్ నిర్వహించారు. ఇందులో వరుడు డ్యాన్స్ చేస్తూ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. నిర్ఘాంతపోయిన బంధువులు, స్నేహితులు గణేశ్‌ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో మృతిచెందాడు. పెళ్లయిన కొన్ని గంటల్లోనే వరుడు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న కన్న కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.

Tags:    

Similar News