నా పెళ్లికి రండి 7 వేలు గిఫ్ట్ గా తీసుకురండి..

దిశ, ఫీచర్స్: సాధారణంగా మ్యారేజ్ ఫంక్షన్లకు హాజరైనపుడు వధూవరులకు ఏదైనా గిఫ్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తాం. లేదంటే సింపుల్‌గా అక్షింతలతో ఆశీర్వదించేస్తాం. అంతేకానీ ఒకవేళ గిఫ్ట్ తీసుకువెళ్లలేదంటే.. ఎందుకు తేలేదని మనల్ని ఎవరూ ప్రశ్నించరు. కానీ ఇక్కడొక పెళ్లి వేడుకలో మాత్రం ఏకంగా వధువే.. తన పెళ్లికి వచ్చిన అతిథుల నుంచి డబ్బు వసూలు చేయడం విశేషం. దీనికోసం తను చెప్పిన కారణం కూడా ఆశ్చర్యం కలిగిస్తుండగా.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నవ […]

Update: 2021-11-12 04:20 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా మ్యారేజ్ ఫంక్షన్లకు హాజరైనపుడు వధూవరులకు ఏదైనా గిఫ్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తాం. లేదంటే సింపుల్‌గా అక్షింతలతో ఆశీర్వదించేస్తాం. అంతేకానీ ఒకవేళ గిఫ్ట్ తీసుకువెళ్లలేదంటే.. ఎందుకు తేలేదని మనల్ని ఎవరూ ప్రశ్నించరు. కానీ ఇక్కడొక పెళ్లి వేడుకలో మాత్రం ఏకంగా వధువే.. తన పెళ్లికి వచ్చిన అతిథుల నుంచి డబ్బు వసూలు చేయడం విశేషం. దీనికోసం తను చెప్పిన కారణం కూడా ఆశ్చర్యం కలిగిస్తుండగా.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నవ వధువు తన మ్యారేజ్ సెర్మనీకి కోసం ఒక్కో అతిథిని రూ. 7 వేలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించింది. రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఖర్చులను భరించే స్థోమత తమకు లేదని ఆహ్వాన పత్రికలోనే తెలిపిన పెళ్లి కూతురు.. వివాహానికి హాజరయ్యేవారు 99 యూఎస్ డాలర్లను చెల్లించాల్సిందిగా కోరింది. అంతేకాదు మ్యారేజ్ వేదిక తమ నివాసానికి చాలా దూరం ఉన్నందున అతిథులు అక్కడికి చేరుకునేందుకు 4గంటలపాటు డ్రైవ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

వివాహ వేడుక వద్ద స్పెషల్ బాక్స్..

అతిథుల నుంచి విరాళం స్వీకరించేందుకు వివాహ వేడుక వద్ద ఒక పెట్టె ఏర్పాటు చేసి, దానిపై ‘అతిథులు.. దయచేసి మా ఫ్యూచర్‌తో పాటు కొత్త ఇంటి కోసం నగదు విరాళం ఇవ్వండి’ అని రాసిపెట్టింది. కాగా ఈ ఇన్సిడెంట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ఎంత ఆత్మీయుడైనా సరే, అలాంటి మ్యారేజ్ రిసెప్షన్‌కు మాత్రం వెళ్లమని కామెంట్ చేస్తున్నారు. ఇక సదరు జంట అలా చేయకుండా ఉండాల్సిందని ఇంకో నెటిజన్ కామెంట్ చేయగా, వారి వద్ద నిజంగానే డబ్బులు ఉండకపోవచ్చని మరొకరు పేర్కొన్నారు.

 

Tags:    

Similar News