జల్సాలకు బానిస.. ఆలయంలో హుండీ పగలగొట్టి బంగారం, డబ్బు చోరి

దిశ, పెద్దపల్లి : జల్సాలకు అలవాటు పడిన యువత చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామంలో మానేటి రంగనాయకుల స్వామి వారి ఆలయంలో దొంగలు తాళాలు పగలగొట్టి హుండీ పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఆలయం ప్రధాన ద్వారాన్ని పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించి కొంత డబ్బును, మూడు గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. ఉత్సవ విగ్రహాలను ముట్టుకోలేదు. గత రెండు సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో […]

Update: 2021-10-19 10:08 GMT

దిశ, పెద్దపల్లి : జల్సాలకు అలవాటు పడిన యువత చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామంలో మానేటి రంగనాయకుల స్వామి వారి ఆలయంలో దొంగలు తాళాలు పగలగొట్టి హుండీ పగలగొట్టే ప్రయత్నం చేశారు.

ఆలయం ప్రధాన ద్వారాన్ని పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించి కొంత డబ్బును, మూడు గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. ఉత్సవ విగ్రహాలను ముట్టుకోలేదు. గత రెండు సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో సీసీ కెమెరాలు ఉండేవి. వాటిని కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. ఊరికి దూరంగా ఉండటం, రెండు జిల్లాల సరిహద్దు కావడంతో పోలీసుల నిఘా వైఫల్యం కూడా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. రామగుండం కమిషనరేట్‌లోని క్లూస్ టీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొన్ని ఫింగర్ ప్రింట్స్ లభించినట్లు ఉపేంద్ర రావు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు త్వరలోనే నిందితులను గుర్తించనున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా దొంగలను తొందరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News