ఏప్రిల్‌లో ‘జీఎస్టీ’ రికార్డు బద్దలు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు సృష్టించాయి. గతనెలలో రూ. 1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇవే అత్యధికం. మార్చి నెలలో 1.23 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఏప్రిల్‌లో దాదాపు 14శాతం అధికంగా జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. గత ఏడు నెలలుగా నెలవారీగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లపైనే వసూలవుతున్నాయి. అంతేకాదు, క్రమంగా పెరుగుతున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతున్నదనడానికి […]
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు సృష్టించాయి. గతనెలలో రూ. 1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇవే అత్యధికం. మార్చి నెలలో 1.23 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఏప్రిల్‌లో దాదాపు 14శాతం అధికంగా జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. గత ఏడు నెలలుగా నెలవారీగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లపైనే వసూలవుతున్నాయి. అంతేకాదు, క్రమంగా పెరుగుతున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతున్నదనడానికి ఈ వసూళ్లు సంకేతమని కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఏప్రిల్ నెలలో రూ. 1,41,384 కోట్ల జీఎస్టీ వసూలవ్వగా, అందులో సీజీఎస్టీ వాటా రూ. 27,837 కోట్లు, ఎస్‌జీఎస్టీ 35,621 కోట్లు, ఐజీఎస్టీ రూ. 68,481 కోట్లు(దిగుమతలు వసూలు చేసిన రూ. 29,599 కోట్లు సహా), సెస్సు రూ. 9,445 కోట్లు(దిగుమతులపై కలెక్ట్ చేసిన రూ. 981 కోట్లు సహా) సేకరించినట్టు వివరించింది.