BREAKING : సైబర్ నేరగాళ్ల బరితెగింపు.. రైల్వే ఉద్యోగికి రూ.10 లక్షల టోకరా

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో మోసాలు చేసేందుకు సెబర్ నేరగాళ్ల పని సులువు అయిపోయింది.

Update: 2024-01-19 05:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో మోసాలు చేసేందుకు సెబర్ నేరగాళ్ల పని సులువు అయిపోయింది. చూస్తుండగానే అకౌంట్లలో దాచుకున్న డబ్బును అందిన కాడికి దోచుకుంటూ సామాన్యుల కడుపుకొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హనుకొండలో ఓ రైల్వే ఉద్యోగి లోకేష్‌కు సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడే అలవాటు ఉన్న లోకేష్ గేమ్ ఆడుతుండగా.. పొరపాటున మొబైల్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైన లింక్‌ను ఓపెన్ చేశాడు. ఇంకేముంది అతడి అకౌంట్‌లో ఉన్న రూ.10 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు గుల్లా చేశారు. దీంతో బాధితుడు లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

Tags:    

Similar News