థియేటర్ల రీ ఓపెనింగ్‌కు బ్రేక్

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల రీ ఓపెనింగ్‌కు బ్రేక్ పడింది. 13జిల్లాల సినిమా ఎగ్జిబిటర్లు బుధవారం విజయవాడలో సమావేశమై థియేటర్లు.. తెరవాలా వద్ద అన్నదానిపై చర్చలు జరిపారు. అయితే థియేటర్లు తెరిచేందుకు ఒక్కో థియేటర్‌కు రూ.10లక్షల వరకు అదనపు ఖర్చు అవుతుందని అభిప్రాయపడ్డారు. 50శాతం ఆక్యుపెన్సీతో నిర్వహణ కష్టమని భావించి రేపటి నుంచి (గురువారం) థియేటర్ల ఓపెన్‌ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు ఎత్తివేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ […]

Update: 2020-10-14 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల రీ ఓపెనింగ్‌కు బ్రేక్ పడింది. 13జిల్లాల సినిమా ఎగ్జిబిటర్లు బుధవారం విజయవాడలో సమావేశమై థియేటర్లు.. తెరవాలా వద్ద అన్నదానిపై చర్చలు జరిపారు. అయితే థియేటర్లు తెరిచేందుకు ఒక్కో థియేటర్‌కు రూ.10లక్షల వరకు అదనపు ఖర్చు అవుతుందని అభిప్రాయపడ్డారు.

50శాతం ఆక్యుపెన్సీతో నిర్వహణ కష్టమని భావించి రేపటి నుంచి (గురువారం) థియేటర్ల ఓపెన్‌ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు ఎత్తివేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్ విడుదల చేసి .. సినిమా హాల్స్, మల్టీప్లెక్స్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అక్టోబర్ 15నుంచి ఓపెన్‌ చేసుకోవచ్చని తెలిపిన సంగతి తెలిసిందే.

 

Tags:    

Similar News