న్యూ ఇయర్ ఈవెంట్లకు బ్రేక్..!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ ఈవెంట్లకు బ్రేక్ పడనుంది. కొత్త సంవత్సరం ప్రారంభ నేపథ్యంలో ప్రతీ ఏటా నిర్వహించే పార్టీలపై ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించనున్నది. గతేడాది విధించినట్లే జనసమూహాలను నియంత్రించనున్నది. ఒమిక్రాన్వ్యాప్తి దృష్ట్యా జనాలు గుమిగూడకుండా ఆంక్షలు విధించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్కార్పాటించనున్నది. పార్టీలు, స్పెషల్ ఈవెంట్స్‌ను రద్దుచేయాలనుకుంటున్నది. ఈవెంట్స్మేనేజర్లతోనూ స్థానిక పోలీసులు చర్చలు జరుపుతున్నారు. బుకింగ్‌లు, జన సమూహాలు, పార్టీల సంఖ్య పై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ ఈవెంట్లకు బ్రేక్ పడనుంది. కొత్త సంవత్సరం ప్రారంభ నేపథ్యంలో ప్రతీ ఏటా నిర్వహించే పార్టీలపై ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించనున్నది. గతేడాది విధించినట్లే జనసమూహాలను నియంత్రించనున్నది. ఒమిక్రాన్వ్యాప్తి దృష్ట్యా జనాలు గుమిగూడకుండా ఆంక్షలు విధించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్కార్పాటించనున్నది. పార్టీలు, స్పెషల్ ఈవెంట్స్‌ను రద్దుచేయాలనుకుంటున్నది. ఈవెంట్స్మేనేజర్లతోనూ స్థానిక పోలీసులు చర్చలు జరుపుతున్నారు. బుకింగ్‌లు, జన సమూహాలు, పార్టీల సంఖ్య పై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అనుమతులు తీసుకున్న పర్మిషన్లు రద్దు చేయనున్నట్లు పోలీసులు తేల్చి చెప్పారు. అయితే మంత్రి వర్గంలో చర్చ తర్వాతే సర్కార్ దీనిపై అధికారికంగా ప్రకటించనున్నది. ముందస్తు వ్యాప్తి నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సెక్రటేరియట్‌లోని ఓ అధికారి తెలిపారు.
వైరస్ చైన్‌కు బ్రేక్..
గ్రూప్గేదరింగ్స్ను కట్టడి చేస్తే వైరస్చైన్కొంత వరకు తెగిపోతుంది. తద్వారా కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతుంది. దీంతో వైరస్‌తీవ్రత తగ్గి, వ్యాప్తిని కంట్రోల్చేయొచ్చు. గత రెండేళ్ల అనుభావాల పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రస్తుతానికి న్యూ ఇయర్ఈవెంట్లు, పార్టీలపై మాత్రమే ఆంక్షలు విధించాలనుకుంటున్న సర్కార్, మంత్రి వర్గం చర్చ తర్వాత బార్లు, పబ్‌లు, స్టార్ హోటళ్లు, ఫంక్షన్హాల్స్పై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఏర్పడే జనసమూహాలతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది.
న్యూ ఇయర్‌తో షురూ అయిన ఆంక్షలు సంక్రాంతి పండుగ వేడుకల వరకు కొనసాగించాలనుకుంటున్నారు. ఆ తర్వాత మరోసారి పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారులు, వైద్యశాఖ హెచ్ఓడీలు, ఉన్నతాధికారుల కూడా ప్రభుత్వానికి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. గత ఏడాదిలానే ఆంక్షలు విధిస్తే బెటర్ అని కొందరు ప్రభుత్వ అధికారులు సర్కార్‌కు వివరించినట్లుఓ అధికారి తెలిపారు.
స్పీడ్ పెంచిన ఒమిక్రాన్…
గతంలో ఉన్న డెల్టా కరోనాతో పోల్చితే ఒమిక్రాన్ఏకంగా ఆరు రెట్లు అదనంగా వ్యాప్తి చెందుతున్నదని డాక్టర్లు, సైంటిస్టులు, నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పలు రీసెర్చ్‌లు, ఒమిక్రాన్వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లోనూ ఇదే జరుగుతున్నది. దీంతో డిసెంబర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్స్, అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వకూడదని సర్కార్ భావిస్తున్నది. మరోవైపు ఆ రోజు రాత్రి మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్‌లు కూడా నిర్వహించే అవకాశం ఉన్నది.
హైకోర్టు ఆదేశాలు పాటిస్తాం: ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
జనాలు గుమిగూడకుండా ఆంక్షలు విధించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తాం. మంత్రి వర్గంలో చర్చించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రజల ఆరోగ్యం రక్షించడమే ప్రభుత్వం అంతిమ లక్ష్యం. మరోవైపు వ్యాక్సిన్, కరోనా కట్టడి చర్యలపై త్వరలోనే కేంద్రంతో చర్చిస్తాం.