ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలకు బ్రేక్ !
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలకు బ్రేక్ పడనుంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రస్తుతం నడుస్తున్న పథకాలను నిలిపివేయాలని ఎస్ఈసీ తెలిపింది. ఈ మేరకు శనివారం సీఎస్‌కు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఉన్నపళంగా ఇళ్లపట్టాల పంపిణీ ఆగిపోనుండగా అమ్మఒడి పథకానికి కూడా ఎన్నికల కోడ్ అడ్డోస్తుంది. అంతేగాక సోమవారం నెల్లూరు జిల్లాలో ‘అమ్మఒడి’ పథకం రెండో విడతకు సన్నాహాలు చేస్తున్న కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారా లేదా అన్నది సైతం ఉత్కంఠను కలిగిస్తోంది. […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలకు బ్రేక్ పడనుంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రస్తుతం నడుస్తున్న పథకాలను నిలిపివేయాలని ఎస్ఈసీ తెలిపింది. ఈ మేరకు శనివారం సీఎస్‌కు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఉన్నపళంగా ఇళ్లపట్టాల పంపిణీ ఆగిపోనుండగా అమ్మఒడి పథకానికి కూడా ఎన్నికల కోడ్ అడ్డోస్తుంది. అంతేగాక సోమవారం నెల్లూరు జిల్లాలో ‘అమ్మఒడి’ పథకం రెండో విడతకు సన్నాహాలు చేస్తున్న కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారా లేదా అన్నది సైతం ఉత్కంఠను కలిగిస్తోంది. అటు బడ్జెట్ కేటాయింపులు చేసినా పథకాల అమలు ఓటర్లను ప్రభావితం చేసినట్లేనని ఈసీ స్పష్టం చేయడంతో.. ఇది రాజకీయ అజెండాగా కనిపిస్తోందని నేతలు అభిప్రాయ పడుతున్నారు.